జాన్వి చీ కొట్టినా.. అనన్య అంగీకరించింది.!

By అంజి  Published on  20 Jan 2020 6:39 AM GMT
జాన్వి చీ కొట్టినా.. అనన్య అంగీకరించింది.!

అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వి కపూర్ తెలుగులో విజయ్‌ దేవరకొండ సరసన నటిస్తోందని కొన్ని రోజులుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండతో చెయ్యబోతున్న ఫైటర్ సినిమాలో జాన్వి కపూర్ ను హీరోయిన్ గా ఒప్పించాలని పూరి బాగానే ఉడికిపోయాడు. కానీ పూరిని జాన్వి పట్టించుకోలేదు. దాంతో యంగ్ బ్యూటీ అనన్య పాండేను హీరోయిన్ గా తీసుకున్నారు. అనన్యకి పూరి చెప్పిన కథ నచ్చడంతో సినిమాకు ఓకే చెప్పిందట. అయితే ఈ విషయంపై ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ వెలువడాల్సి ఉంది. ఇకపోతే ఈ సినిమా రెగ్యులర్ షూట్ రేపటి నుండి ముంబైలో మొదలుకానుంది.

Ananya Pandey

అన్నట్టు విజయ్ దేవరకొండ చాల రోజులనుంచి ఓ బాలీవుడ్ సినిమా చేయాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూశాడు. ఈ క్రమంలోనే బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ విజయ్ దేవరకొండను బాలీవుడ్ లో పరిచయం చేసే బాధ్యత తీసుకున్నాడు. కాగా ఫైటర్ సినిమాని అన్ని దక్షిణ భాషలతో పాటు హిందీలో కూడా ఒకేసారి తెరకెక్కించనున్నారు. ఫైటర్ కథలో పాన్ ఇండియా అప్పీల్ ఉందట. అందుకే కరణ్ జోహార్ తో పాటు పూరి, ఛార్మిలతో కలిసి ఈ సినిమాని నిర్మించనున్నారు. ఇక ఈ చిత్రం 2020 సమ్మర్ లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

81649778 183469776388951 7175164631742713905 N 82004331 1069955236691732 7772876829449995608 N

Next Story