నితిన్ పెళ్లి డేట్ ఫిక్స్
By తోట వంశీ కుమార్ Published on 18 July 2020 6:11 PM ISTటాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్‌లలో నితిన్ ఒకడు. కరోనా మహమ్మారి కారణంగా నితిన్ పెళ్లి వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరిలోనే షాలినితో నిశ్చితార్ధం చేసుకున్న నితిన్.. డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసుకున్నప్పటికీ కరోనా కారణంగా కలిసి రాలేదు. బంధుమిత్రుల నడుమ గ్రాండ్‌గా పెళ్లి చేసుకుందామని ఆశపడినా.. కరోనా మహమ్మారి ప్రభావం ఇప్పుడప్పుడే తగ్గే చాన్స్ లేదు. దీంతో అతి కొద్దిమంది బంధువుల మధ్య వివాహ మహోత్సవాన్ని హైదరాబాద్‌లోని ఓ ఫామ్ హౌస్‌లో జరుపుకునేందుకు రెడీ అయ్యాడు నితిన్.
జూలై 26న రాత్రి 8:30 గంటలకు షాలినితో కలిసి ఏడడుగులు వేయబోతున్నాడు. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వ నియమ నిబంధన పాటిస్తూ, తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వివాహ వేడుకను నిర్వహించనున్నారు. ఈ వేడుకకు కేవలం ఇరు కుటుంబాలతో పాటు సన్నిహితులు, ఫ్రెండ్స్ హాజరవనున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ఇప్పటికే ‘భీష్మ’ సక్సెస్‌లో ఉన్న నితిన్.. ‘రంగ్ దే’, ‘అంధాధున్ రీమేక్’, ‘పవర్ పేట’, ‘చెక్’ సినిమాల్లో నటిస్తున్నాడు.