రేపే నిఖిల్ పెళ్లి..?

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 May 2020 1:54 PM GMT
రేపే నిఖిల్ పెళ్లి..?

క‌రోనా మ‌హ‌మ్మారి క‌ట్ట‌డి కోసం దేశ వ్యాప్త‌లాక్‌డౌన్‌‌ను విధించ‌గా.. ప్ర‌జ‌లంతా ఇళ్ల‌కే ప‌రిమితం అయ్యారు. దీంతో దేశంలో ఎన్నో శుభ‌కార్యాలు వాయిదా ప‌డ్డాయి. కొంద‌రు అధికారుల నుంచి ప‌ర్మిష‌న్ తీసుకుని అతి కొద్ది మంది స‌మ‌క్షంలో ఒక్క‌టి కాగా.. మ‌రికొంద‌రు త‌మ వివాహాల‌ను వాయిదా వేసుకున్నారు.

పెళ్లిళ్లు వాయిదా వేసుకున్న జంట‌ల్లో టాలీవుడ్ హీరోలు నితిన్, నిఖిల్ లు కూడా ఉన్నారు. ప‌ల్ల‌వి వ‌ర్మ అనే డాక్ట‌ర్‌తో గ‌త కొంత‌కాలంగా ప్రేమ‌లో ఉన్న నిఖిల్ పెద్ద‌ల అంగీకారంతో పెళ్లికి సిద్ద‌మ‌య్యాడు. ఏప్రిల్ 16న నిఖిల్ వివాహాం జ‌ర‌గాల్సి ఉంది. అయితే.. లాక్‌డౌన్ కార‌ణంగా పెళ్లి వాయిదా ప‌డింది. ముందుగా గుడిలో అయిన పెళ్లి చేసుకోవాల‌ని బావించిన ఈ యంగ్ హీరో.. త‌రువాత త‌న ఆలోచ‌న‌ను విర‌మించుకుని పెళ్లిని వాయిదా వేసుకున్నాడు.

దీంతో ఇరు కుటుంబాల పెద్ద‌లు మే 14కి కొత్త ముహూర్తం పెట్టుకున్నారు. అయితే మ‌రోసారి లాక్‌డౌన్ ను పెంచ‌డంతో మ‌రో సారి పెళ్లిని వాయిదా వేయాల‌ని అనుకున్నారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ మే17 త‌రువాత కూడా లాక్‌డౌన్ కొన‌సాగుతుంద‌ని ప్ర‌క‌టించ‌డం.. మే 14 త‌రువాత ముహూర్తాలు లేక‌పోవ‌డంతో రెండో సారి అనుకున్న ముహూర్తానికే నిఖిల్-ప‌ల్ల‌వి వ‌ర్మ‌ల‌ పెళ్లి చేయాల‌ని ఇరు కుటుంబాల వారు ఫిక్స‌య్యార‌ని తెలుస్తోంది. లాక్‌డౌన్ నిబంధ‌న‌లు పాటిస్తూ.. అతి కొద్ది స‌మ‌క్షంలో గురువారం నిఖిల్ పెళ్లి జ‌ర‌గ‌నుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

Next Story
Share it