తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని ప్రపంచానికి తెలియజేసిన రానా..!

By సుభాష్  Published on  12 May 2020 12:24 PM GMT
తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని ప్రపంచానికి తెలియజేసిన రానా..!

రానా దగ్గుబాటి.. చాలా రోజులుగా సింగిల్ స్టేటస్ ను ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. రానా పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడా.. ఎవరిని చేసుకుంటాడా.. అసలు చేసుకుంటాడా అని చాలా ప్రశ్నలు అతన్ని అడిగి అడిగి పెట్టారు. చాలా ఇంటర్వ్యూలలో ఆ విషయాల్ని అడిగినా నవ్వుతూ తప్పించుకున్నాడు రానా..!

తాజాగా తాను ప్రేమలో ఉన్న విషయాన్ని.. తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరన్న విషయాన్ని ప్రపంచానికి తెలియజేశాడు రానా దగ్గుబాటి. అమ్మాయి పేరు మిహీక బజాజ్. తనకు యస్ చెప్పింది అంటూ లవ్ సింబల్ ఉన్న ఫోటోను అప్లోడ్ చేశాడు. మిహీక బజాజ్ అనే అమ్మాయితో తాను రిలేషన్ షిప్ లో ఉన్నానని.. ఆమె 'యస్' చెప్పింది అంటూ తన పర్సనల్ విషయాన్ని బయట పెట్టింది. ఆమె రానాతో ప్రేమకు యస్ చెప్పిందా.. పెళ్ళికి యస్ చెప్పిందా అన్నది తెలియాల్సి ఉంది. పెళ్ళికి యస్ చెప్పి ఉంటుంది కాబట్టే ఈ విషయాన్ని రానా బయటపెట్టాడేమో..!

రానా గతంలో త్రిషతో డేటింగ్ లో ఉన్నాడు. ఈ విషయాన్ని కాఫీ విత్ కరణ్ సినిమా షూటింగ్ లో కూడా బయటపెట్టాడు. త్రిషతో తనకు కొన్ని దశాబ్దాల పరిచయం ఉందని.. కానీ అది పెళ్లి వరకూ దారి తీయలేదని బాహుబలి నటుడు చెప్పుకొచ్చాడు. రానా దగ్గుబాటి హీరోగా నటించిన అరణ్య సినిమా విడుదలకు వచ్చింది. రానా అరణ్య సినిమాను పలు భాషల్లో విడుదల చేయాలని భావించారు.. ఇంతలో లాక్ డౌన్ కారణంగా సినిమా రిలీజ్ వాయిదా పడింది. ఇక విరాటపర్వం అనే సినిమాలో కూడా రానా నటిస్తూ ఉన్నాడు.

Next Story