బాలీవుడ్‌కు రంగమత్త..!

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 May 2020 10:26 AM GMT
బాలీవుడ్‌కు రంగమత్త..!

తెలుగులో హాట్ యాంక‌ర్‌గా గుర్తింపు పొందిన అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌కు టాలీవుడ్ లో చాలా చిత్రాల్లో అవ‌కాశాలు వ‌చ్చాయి. అయితే.. తొంద‌ర ప‌డ‌కుండా త‌న‌కు వ‌చ్చిన అవ‌కాశాల్లో న‌ట‌న‌కు ప్రాధాన్యం ఉన్న పాత్ర‌ల్లో న‌టిస్తూ.. ఓ మంచి న‌టిగా గుర్తింపు తెచ్చుకుంది. 'రంగ‌స్థ‌లం' సినిమాలో అన‌సూయ పోషించిన రంగ‌మ‌త్త పాత్ర ప్రేక్ష‌కుల మ‌దిలో చెద‌ర‌ని ముద్ర వేసింది. ప్ర‌స్తుతం షోలు, సినిమాల‌తో పుల్ బిజీగా ఉన్న అన‌సూయ‌కు ఓ బంప‌ర్ ఆఫ‌ర్ వ‌చ్చింద‌ట‌.

ఇప్ప‌టి వ‌ర‌కు టాలీవుడ్ కే ప‌రిమితం అయిన అన‌సూయ ఇప్ప‌డు బాలీవుడ్‌లో కూడా అడుగు పెట్టేందుకు రంగం సిద్ద‌మైందని అంటున్నారు. అయితే సినిమాల్లో కాదుకానీ.. సీరియ‌ల్స్‌లో న‌ని తెలుస్తోంది. ఓ టాప్ రేటెడ్ సీరియల్ కోసం అనసూయను అడిగారని వార్తలు వినిపిస్తున్నాయి.

హిందీ సీరియ‌ల్స్‌కు దేశ వ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉంది. ఇక్క‌డ ఒక్క‌సారి పేరు తెచ్చుకుంటే చాలు ద‌శ తిరిగిన‌ట్లే. ఓ హిందీ సీరియల్‌లో మెయిన్ లీడ్ చేసే అవకాశం రావ‌డం.. తక్కువ రోజులే డేట్స్ అడగడంతో ఈమె కూడా ఒప్పుకుందనే ప్రచారం జరుగుతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు అయితే.. అన‌సూయ సీరియ‌ల్స్ లో న‌టించ‌లేదు కానీ.. మంచి అవ‌కాశం కావ‌డంతో.. ఒప్పుకుంద‌నే గుస గుస‌లు వినిపిస్తున్నాయి. ఒక‌వేళ ఇదే నిజ‌మైతే.. అన‌సూయ ఓ రేంజ్‌లో దూసుకెళ్ల‌డం ఖాయం అని అంటున్నారు ఆమె అభిమానులు.

Next Story