సింగర్‌గా నాని భార్య.. సూపర్ అంటున్న నెటీజన్లు
By తోట వంశీ కుమార్ Published on 1 July 2020 5:29 PM ISTవిభిన్న కథలు, పాత్రలు ఎంచుకుంటూ చేసిన ప్రతి పాత్రలో జీవిస్తూ.. అభిమానుల చేత న్యాచురల్ స్టార్ అని అనిపించుకుంటున్నాడు నాని. లాక్‌డౌన్ వల్ల సినిమా షూటింగ్‌లు లేకపోవడంతో తన ఫ్యామితో కలిసి విలువైన సమయాన్ని గడుపుతున్నారు. నాని ఎంత నార్మల్‌గా ఉంటారో అతని భార్య అంజనా యలవర్తి కూడా అలానే ఉంటారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేస్తూ నాని అభిమానులను అలరిస్తూ ఉంటారు. ఇటీవల అంజనా గాయనిగా కూడా మారారు. ఈ వీడియో క్లిప్‌లో అంజనా తన స్నేహితురాలితో కలిసి పాడిన పాట నెట్టింట వైరల్‌గా మారింది.
‘ప్రేమికుడు’ చిత్రంలోని ‘అందమైన ప్రేమరాణి చేయి తగిలితే’..సాంగ్ ను తన ఫ్రెండ్ తో కలిసి హమ్ చేస్తూ అలరించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారింది. నెటిజన్లను ఆమె వాయిస్ చాలా బాగుందంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ పాటకు ఎ.ఆర్.రెహమాన్ సంగీతం సమకూర్చగా.. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఉదిత్ నారాయణ్ పాడారు. ఈ చిత్రంలో ప్రభుదేవా, నగ్మా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని ఎస్ శంకర్ దర్శకత్వం వహించారు.