లలితా జ్యూవెలర్స్‌ షాప్‌ అనుకున్నారా.. లాకర్‌రూమ్‌ అనుకున్నారా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 Jun 2020 1:02 PM GMT
లలితా జ్యూవెలర్స్‌ షాప్‌ అనుకున్నారా.. లాకర్‌రూమ్‌ అనుకున్నారా

కామెడి చిత్రాలకు పెట్టింది అల్లరి నరేష్‌. అల్లరి నరేష్‌ మినిమమ్‌ గ్యారెంటీ హీరో అనే వారు. ఈ మధ్య ఎందుకనో అల్లరోడికి అశించిన మేర విజయాలు దక్కడం లేదు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం 'బంగారు బుల్లోడు'. అల్లరి నరేష్‌ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో నరేష్‌ సరసన పూజా ఝవేరి నటిస్తోంది. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మింస్తుండగా.. పివి. గిరి దర్శకత్వం వహిస్తున్నాడు.

లలితా జ్యూవెలర్స్‌ షాప్‌ అనుకున్నారా.. లాకర్‌రూమ్‌ అనుకున్నారా అనే డైలాగ్‌తో ఈ టీజర్‌ మొదలవుతుంది. అందరూ పెళ్లి అవ్వాలని ముడుపులు కడతారు.. కానీ నేను ఆ దొంగ దొరకాలి అంటూ పృధ్వీ చెప్పే డైలాగ్‌లు ఆకట్టుకున్నాయి. చివర్లో ఇదేంటి ఇప్పుడే నగలన్ని ఎవరో పెట్టుకుని తీసినట్లు మల్లేపువ్వులు ఉన్నాయి అని అడగుగా.. ఇప్పటికైనా నమ్ముతారా మా బ్యాంకు మీ నగల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటుంది నరేష్‌ చెప్పే డైలాగ్‌తో టీజర్‌ పూర్తి అవుతుంది. బ్యాంక్‌ లాకర్‌లో నగలు మాయంకావడం.. వాటిని పోలీసులు వెతకడం.. హీరో లక్‌ ట్రాక్‌ లా అనిపిస్తోంది. చాలా రోజుల తరువాత నరేష్‌ నుంచి మంచి కామెడీ టైం కనపడుతోంది. పూజా గ్లామరస్‌గా కనిపించింది.

Next Story