విజయవాడ: అక్రమ గుట్కాను తరలించేందుకు కొంతమంది కేటుగాళ్లు అడ్డదారులు తొక్కుతున్నారు. లాక్‌డౌన్‌ అమలులో ఉన్నప్పటికి పోలీసులు కన్నగుప్పి అక్రమ గుట్కాను కూరగాయల వాహనంలో తరలించే ప్రయత్నం చేశారు. చివరికి పోలీసులకు చిక్కారు. కృష్ణా జిల్లా కంచికచర్లలో పోలీసులు భారీగా గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. కూరగాయలు తరలించే వాహనంలో గుట్కాను తరలిస్తుండగా.. పోలీసులు అడ్డుకొని వాహనాన్ని తనిఖీ చేశారు. వాహనంలో కూరగాయలతో పాటు భారీగా గుట్కాను పట్టుకున్నారు. గుట్కా విలువ సుమారు రూ.3 లక్షల 50 వేలు ఉంటుందని పోలీసులు తెలిపారు. గుట్కాను తరలిస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో బయట తిరగొద్దని పోలీసులు ఎంత చెప్తున్నా కొంత మంది మాత్రం అస్సలు వినడం లేదు. వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.

 

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.