క్వారంటైన్ లో పౌష్టికాహారం
By రాణి Published on 9 April 2020 5:43 PM ISTకరోనా వైరస్ పై పోరాడి విజయం సాధించాలంటే ప్రతిఒక్కరూ రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. అందుకోసం పండ్లు, డ్రై ఫ్రూట్స్, మాంసాహారం, గుడ్లు తదితర ఆహారాన్ని తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ మొదలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, డాక్టర్లు, నర్సులు, ఆశా వర్కర్లంతా చెబుతున్నారు. రోగనిరోధక శక్తి లేకనే ప్రపంచ వ్యాప్తంగా సుమారు 85 వేల మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. 10 ఏళ్ల లోపు వయస్కులు, 45 దాటిన వారు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. బలమైన ఆహారం తీసుకోవాలి.
Also Read : ప్రముఖ టీవీ యాంకర్ అనుమానస్పద మృతి
క్వారంటైన్ లో ఉన్నవారికి రోగనిరోధక శక్తి పెంచేందుకు ఏపీ ప్రభుత్వం పండ్లు, డ్రై ఫ్రూట్స్ ను పంపిణీ చేస్తోంది. విజయవాడలో ఉన్న ఒక క్వారంటైన్ సెంటర్ లో జీడిపప్పు, బాదంపప్పు, కిస్ మిస్, ఎండు ఖర్జూరం, అరటిపండ్లు, కమలా పండ్లను ఆహారంగా అందిస్తున్నారు. మిగతా ప్రజలు కూడా రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని క్రమంగా తీసుకోవాలని సూచిస్తున్నారు అధికారులు. అదేవిధంగా ఉపాధి కోల్పోయిన కార్మికులకు, వలస కూలీలకు, నిలువ నీడ లేని పేదలకు పౌష్టికాహారంతో పాటు బియ్యం, పప్పు, గుడ్లు ఇతర నిత్యావసరాలను అందజేయాలని కోరుతున్నారు.
Also Read : కరోనా పేరుతో దళితులపై అమానుషం..