ప్రముఖ టీవీ యాంకర్‌ అనుమానస్పద మృతి

By సుభాష్  Published on  9 April 2020 10:23 AM GMT
ప్రముఖ టీవీ యాంకర్‌ అనుమానస్పద మృతి

ప్రముఖ టీవీ యాంకర్‌, సీరియర్‌ నటి శాంతి (విశ్వశాంతి) అనుమానస్పదంగా మృతి చెందింది. ఎల్లారెడ్డిగూడ ఇంజనీర్స్‌ కాలనీలో ఆమె నివాసంతో గురువారం శవమై కనిపించింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఆమె చనిపోవడానికి గల కారణాలను చుట్టుపక్కల వారిని అడిగి తెలుసుకున్నారు. ఇంట్లో తనిఖీలు చేపట్టారు. ఆమె ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు, అక్కడి సీసీ పుటేజీలను పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

అయితే శాంతి ఆత్మహత్య చేసుకుందా.. లేక ఎవరైన హత్య చేశారా..? అనే కోణంలో దర్యాప్తు చేపడుతున్నారు. కాగా గత నాలుగు రోజులు నుంచి శాంతి తన గదిలో నుంచి బయటకు రాలేదని స్థానికులు, అపార్ట్‌ మెంట్‌ వాసులు పోలీసులకు తెలిపారు. అపార్ట్‌ మెంట్‌లో శాంతి గత మూడు సంవత్సరాలుగా ఉంటోందని తెలిపారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా విచారణ చేపడతామని పోలీసులు తెలిపారు.

Next Story
Share it