ఎంతో మంది పిల్లల ప్రాణాలను కాపాడుతున్న మిల్క్ బ్యాంక్స్

World breastfeeding week TS human milk bank Niloufer fed 27000 newborns since 2017. ఎంతో మంది మహిళలు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. ఉద్యోగాలు చేస్తూనే

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 Aug 2023 3:51 PM GMT
ఎంతో మంది పిల్లల ప్రాణాలను కాపాడుతున్న మిల్క్ బ్యాంక్స్

ఎంతో మంది మహిళలు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. ఉద్యోగాలు చేస్తూనే పిల్లలను చూసుకుంటూ ఉన్నారు. అయితే నవజాత శిశువులకు తల్లిపాలు ఇవ్వడం సవాలుగా మారింది. ఈ సంవత్సరం, ప్రపంచ తల్లిపాల వీక్(World Breastfeeding Week)కు థీమ్ గా ‘Let’s make breastfeeding and work, work!’ తెలిపారు. ఈ క్యాంపెయిన్ లో శ్రామిక మహిళలకు సహాయపడే పద్ధతులను ప్రోత్సహిస్తారు. కార్యాలయాల్లో తల్లులకు పాలివ్వడాన్ని ప్రోత్సహించడంపై దృష్టి పెడతారు. చాలా కార్యాలయాలలోనూ, బహిరంగ ప్రదేశాలలో బ్రెస్ట్ ఫీడింగ్ కు సరైన సౌకర్యాలు లేవు. పాలిచ్చే తల్లులకు ప్రత్యేకమైన స్థలాన్ని కేటాయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

తల్లిపాలు పసి పిల్లలకు ఎంతో మేలు చేస్తాయి. అనేక శారీరక, మానసిక-సామాజిక ప్రయోజనాలను కలిగిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచే తల్లిపాలు పిల్లల సమగ్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

WHO, UNICEF తల్లిపాలపై సిఫార్సులు:

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), UNICEF శిశువులకు పుట్టిన మొదటి గంటలోపు తల్లిపాలు పట్టడం ప్రారంభించాలని.. మొదటి ఆరు నెలలు తప్పకుండా తల్లిపాలు కొనసాగించాలని.. వీలైతే రెండేళ్ల పాటూ తల్లిపాలు ఇవ్వాలని సిఫార్సు చేస్తున్నాయి.

రెండు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలందరూ తల్లిపాలు తాగితే ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారిలో 13% మరణాలను నిరోధించే సామర్థ్యాన్ని తల్లిపాలు కలిగి ఉంటాయి. పుట్టిన మొదటి గంటలోపు తల్లిపాలు పట్టించడం, తల్లిపాలు ఇస్తూ ఉండడం వల్ల మొత్తం నవజాత శిశువుల మరణాలను 22% తగ్గించవచ్చు.

WHO ప్రకారం, 2015- 2020 మధ్య ప్రపంచవ్యాప్తంగా ఆరు నెలల వయస్సు లోపల ఉన్న శిశువులలో కేవలం 44% మాత్రమే తల్లిపాలు పొందారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS-5) ప్రకారం 2019-2021 మధ్య భారతదేశంలో పుట్టిన మొదటి గంటలో కేవలం 41% మంది శిశువులకు మాత్రమే తల్లిపాలు ఇస్తున్నారని వెల్లడించింది. ఆరు నెలల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో కేవలం 64% మాత్రమే తల్లిపాలు ఇస్తున్నారని సర్వేలో తేలింది.

పిల్లలకు పాలివ్వడంలో ఉద్యోగాలు చేస్తున్న మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లు:

ఉద్యోగాలు చేస్తున్న ప్రదేశాలలో గోప్యత, నర్సింగ్ గదులు లేకపోవడం.. ఎక్కువ పని గంటలు, పని ఒత్తిడి, తక్కువ పాల ఉత్పత్తి, కుటుంబ మద్దతు లేకపోవడం మొదలైన కారణాల వల్ల దాదాపు 50% మంది మహిళలు పిల్లలకు తల్లిపాలు కాకుండా ఇతర వాటిని ఎంచుకున్నారు. భారతదేశంలో సవరించిన ప్రసూతి ప్రయోజన చట్టం (2017) కింద పాలిచ్చే శ్రామిక మహిళలకు మద్దతుగా చట్టపరమైన నిబంధనలను ఉన్నా.. ఉద్యోగాలు చేస్తున్న మహిళలకు ఆఫీసుల్లో పాలు ఇవ్వాలంటే సరైన సదుపాయాలను ఇంకా అందించడం లేదు.

వర్కింగ్ ప్రొఫెషనల్స్‌లో తక్కువ మంది తల్లిపాలు పట్టడం వెనుక కారణాలను వివరించారు రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్‌లోని నియోనాటాలజిస్ట్ డాక్టర్ నితాషా బగ్గా. ఆమె మాట్లాడుతూ, "ఈ విషయంపై చేసిన కొన్ని అధ్యయనాల ప్రకారం 15% మంది వర్కింగ్ మహిళలు కూడా ఆరు నెలల వరకు ప్రత్యేకంగా తల్లిపాలను ఇవ్వడం కొనసాగించలేరని అన్నారు. 64% మంది మహిళలు తల్లిపాలను పిల్లలకు ఇవ్వాలని అనుకున్నారు కానీ కొనసాగించలేకపోయారు. మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లలో సుదీర్ఘ పని గంటలు, రాకపోకలకు సమయం, పాలు ఇవ్వడానికి సరైన ప్రాంతం లేకపోవడం, ఇల్లు, కార్యాలయంలో మద్దతు లేకపోవడం, ప్రసూతి సెలవులు సరిపోకపోవడం వంటివి ఉన్నాయి. చనుబాలివ్వడానికి కనీస విరామాలు కూడా ఆఫీసుల్లో దొరకడం లేదు. తల్లి పాలివ్వడాన్ని ప్రోత్సహించడానికి పలు సంస్థలు ముందుకు వస్తేనే పాలిచ్చే తల్లుల సంఖ్య మెరుగుపడుతుంది" అని అన్నారు.

మిల్క్ బ్యాంకులు:

తెలంగాణ పబ్లిక్ సెక్టార్‌లో, నీలోఫర్ హాస్పిటల్ 2017లో హ్యూమన్ మిల్క్ బ్యాంక్‌ను స్థాపించారు. ఇది భారతదేశంలోనే అతిపెద్ద మిల్క్ బ్యాంకు. ఇటీవల గాంధీ ఆస్పత్రి, ఈఎస్‌ఐ ఆస్పత్రి, సుల్తాన్‌ బజార్‌, పేట్లబర్జ్‌లలోని ప్రసూతి ఆసుపత్రులు, ఖమ్మం, సిద్దిపేటలో మరికొన్ని చోట్ల పాల బ్యాంకులు ప్రారంభమయ్యాయి. నగరంలో తల్లులు, శిశు సంరక్షణ కోసం కొన్ని ప్రైవేట్ రంగ ఆసుపత్రులు కూడా వారి సంబంధిత NICUలకు (నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు) అనుబంధంగా తమ మిల్క్ బ్యాంకులను ఏర్పాటు చేశాయి. పలువురు తల్లుల నుండి పాలను మిల్క్ బ్యాంక్‌లు సేకరించి.. వేలాది మంది శిశువులకు సహాయం చేస్తాయి.

నీలోఫర్ హాస్పిటల్‌లోని మిల్క్ బ్యాంక్ గురించి ధాత్రి చైన్ ఆఫ్ మదర్స్ మిల్క్ బ్యాంక్స్ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ సంతోష్ కుమార్ క్రాలేటి మాట్లాడుతూ, “ఇది ప్రారంభమైనప్పటి నుండి, కొందరు తల్లుల నుండి సుమారు 3,500 లీటర్ల పాలను స్వీకరించారు, నీలోఫర్ హాస్పిటల్‌లో దాదాపు 27,000 నవజాత శిశువులకు అందించాం. సాంస్కృతిక అడ్డంకులను అధిగమించి, మా అంచనాలకు మించి స్పందన రావడం ఆనందంగా ఉంది. మానవ ప్రమేయం అవసరం లేని ఆటోమేటెడ్ ఇంపోర్టెడ్ పాశ్చరైజేషన్ మెషీన్‌ని కలిగి ఉన్నాం. ఏ రోజునైనా, కనీసం 50 ప్రీ-టర్మ్ నవజాత శిశువులకు పాల బ్యాంకు నుండి పాలు అవసరం ఉంటుంది. పాలు మైనస్ 20 డిగ్రీల సెల్సియస్ వద్ద నిల్వ చేస్తాం. ఒక సంవత్సరం జీవితకాలం ఉంటుంది.”అని తెలిపారు.

తల్లి పాలలో HMO ఉంటుంది, ఇది హానికరమైన బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ నుండి శిశువును రక్షిస్తుంది. ఫార్ములా పాలు నెక్రోటైజింగ్ ఎంట్రోకోలైటిస్ లేదా డయేరియాకు దారితీసే హానికరమైన బ్యాక్టీరియా సంక్రమణకు కారణమవుతాయని డాక్టర్ సంతోష్ చెప్పారు. 99% మంది తల్లులు ఒత్తిడి కారణంగా లేదా బిడ్డను పట్టుకోవడం, ఉంచడం వంటి సమస్యల కారణంగా పాలివ్వడంలో సమస్యలనుఎదుర్కొంటూ ఉన్నారు. మిల్క్ బ్యాంక్‌లోని మా సిబ్బంది, నర్సులు వారికి సలహా ఇస్తారు. సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ఉన్నామని అన్నారు. బయోలాజికల్ మిల్క్ దొరకని పరిస్థితుల్లో ఇలా దాతల పాలు ప్రజలకు ఎంతో మంచి చేస్తాయి.

“ప్రీ మెచ్యూర్ పిల్లలకు దాతలు అందించే పాలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి, జీర్ణవ్యవస్థతో సహా అవయవాలు ప్రీ-టర్మ్ బేబీలలో సరిగ్గా అభివృద్ధి చెందవు. అధిక-ప్రోటీన్ ఉన్న ఆవు పాలు.. ఫార్ములా పాలు జీర్ణం చేసుకోవడం కష్టమవుతుంది. లాక్టోస్ ఇంటోలరెన్స్ అభివృద్ధి అవుతుంది. అంతేకాకుండా ఫార్ములా పాలలో యాంటీబాడీస్ ఉండవు.. సులభంగా జీర్ణం అవ్వవు. అటువంటి సందర్భాలలో మిల్క్ బ్యాంకులు చేసే సహాయం చాలా గొప్పది. మిల్క్ బ్యాంక్‌లో, దాతల నుండి పాలను సేకరించి, పాశ్చరైజ్ చేసి, నియోనాటల్ కేర్ యూనిట్‌లో నెలలు నిండని శిశువులకు ఇచ్చే ముందు పలు తనిఖీలు చేపడతారు”అని డాక్టర్ నితాషా బగ్గా చెప్పారు.

Next Story