ప్రపంచ వ్యాప్తంగా మహమ్మారి కరోనా వైరస్‌ విజృంభణ ఆగడం లేదు. కొన్ని దేశాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని ఆయా ప్రభుత్వాలు తమ పౌరులకు సూచిస్తున్నాయి. అయితే కొందరు అన్ని జాగ్రత్తలు పాటిస్తున్న కరోనా సోకడంతో దీర్ఘ ఆలోచనలో పడుతున్నారు. దీనికి కేంబ్రిడ్జ్‌ పరిశోధకులు సమధానాన్ని చెప్పారు. ఇతరులకు దూరంగా సామాజిక దూరం పాటించిన (2 మీటర్ల దూరంలో ఉన్నంత మాత్రాన) కరోనా వైరస్‌ సోకదన్న గ్యారెంటీ ఏమీ లేదని పరిశోధకులు తేల్చారు. కరోనా వైరస్‌తో కూడిన తుంపర్లు గాలిలో ప్రయాణిస్తూ.. అవి మనం ఊహించిన దూరం కంటే ఎక్కువగా దూరం చేరుకుంటున్నాయని పేర్కొన్నారు.

ముఖానికి మాస్కు పెట్టుకోవడం, వ్యాక్సిన్‌ వేసుకోవడం వంటి జాగ్రత్తలు పాటించడం ద్వారా కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేయవచ్చాన్నారు. కరోనా వైరస్‌ సోకిన వారు తుమ్మినా, దగ్గినా, చీదినా, అవలింతలు తీసినా నోటి నుండి వైరస్‌తో కూడిన తుంపర్లు బయటకు వస్తాయి. ఇవి వాటి ఇష్టారీతిన వివిధ గమనాల్లో ప్రయాణిస్తూ.. రెండు మీటర్ల దూరంలోని వ్యక్తులను చేరుకుంటాయి. అయితే సురక్షిత దూరమని చెప్పలేమని భారతీయ సంతతికి చెందిన డాక్టర్ శ్రేయ్ త్రివేది అన్నారు. మూడు లేదా అంతకంటే ఎక్కువ దూరం కూడా వైరస్‌ ప్రయాణించొచ్చన్నారు.

అంజి

నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

Next Story