మీ పిల్లలకు బోర్నవీటా ఇస్తూ ఉంటే ఈ విషయం గురించి ఆలోచించండి. వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఇ-కామర్స్ కంపెనీలకు వారి పోర్టల్, ప్లాట్‌ఫారమ్‌లలో 'హెల్త్ డ్రింక్స్' కేటగిరీ నుండి బోర్న్‌విటాను తొలగించాలని ఆదేశిస్తూ ఒక సలహాను జారీ చేసింది. అలాగే పలు డ్రింక్స్ లను కూడా హెల్త్ డ్రింక్స్ కేటగిరీ నుండి తీసివేయాలని సూచించింది.
“National Commission for Protection of Child Rights (NCPCR), a statutory body constituted under Section (3) of the Commission of Protection of Child Rights (CPCR) Act, 2005 after its inquiry under Section 14 of CRPC Act 2005 concluded that there is no ‘health drink’ defined under FSS Act 2006, rules and regulations submitted by FSSAI and Mondelez India Food Pvt Ltd,” అంటూ మినిస్ట్రీ నుండి వివరణ వచ్చింది. బోర్న్‌విటాలో షుగర్ లెవల్స్ ఉన్నాయని, ఇది ఆమోదయోగ్యమైన పరిమితుల కంటే చాలా ఎక్కువగా ఉందని ఎన్‌సిపిసిఆర్ చేసిన పరిశోధన నేపథ్యంలో ఈ కీలక సూచన వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది హెల్త్ డ్రింక్ కాదని అధికారులు తెలిపారు. ఈ ప్రోడక్ట్ లో షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉన్నాయంటూ గతంలో పలువురు బహిరంగంగా చెప్పుకొచ్చారు. అయినా కూడా బోర్నవీటా నిర్వాహకులు పెద్దగా పట్టించుకోలేదు.