Tea Alternatives : ఇంత ఎండల్లో కూడా 'టీ' తాగకుండా ఉండలేకపోతున్నారా.? అయితే ఇవి ట్రై చేయండి..!
మండుతున్న ఎండలు, తీవ్రమైన వడగాలులతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వర్షాకాలం దగ్గర పడుతున్న కొద్ది ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి.
By Medi Samrat Published on 22 May 2024 8:35 AM GMTమండుతున్న ఎండలు, తీవ్రమైన వడగాలులతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వర్షాకాలం దగ్గర పడుతున్న కొద్ది ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. వేడి నుండి ఉపశమనం పొందడానికి చాలా మంది ప్రజలు తమ ఆహారంలో చల్లని పదార్థాలను తీసుకునేందుకు ఇష్టపడతారు. ఇవి వేడి నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతాయి. అయితే కొందరు మాత్రం టీ ను వేసవిలో కూడా వదులుకోలేకపోతున్నారు. వేసవిలో కూడా టీకి వీడ్కోలు చెప్పలేని వారిలో మీరు ఉన్నట్లైతే.. ఈ కథనంలో మేము టీకి ప్రత్యామ్నాయంగా కొన్నింటిని మీకు తెలియజేస్తాము, ఇవి వేసవిలో మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. వేసవి కోసం అలాంటి కొన్ని రిఫ్రెష్ డ్రింగ్‌ల గురించి తెలుసుకుందాం..
హైబిస్కస్ టీ
వేసవిలో టీ ని వదలలేని వారికి హైబిస్కస్ టీ మంచి ఆప్షన్. ఈ టీ సహజంగా చల్లదనాన్ని కలిగిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీన్ని తీసుకుంటే ఎండాకాలంలో ఇది మీకు పర్ఫెక్ట్ డ్రింక్‌గా మారుతుంది.
చమోమిలే టీ
చమోమిలే టీ శీతలీకరణకు ప్రసిద్ధి చెందింది. వేసవిలో చల్లదనం కోరుకునేవారికి ఈ టీ చాలా మంచిది. దీని రుచి రిఫ్రెష్ కలిగిస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల వేసవిలో మీకు ఉపశమనం ఇస్తుంది.
లెమన్‌గ్రాస్ టీ
వేసవిలో లెమన్‌గ్రాస్ టీ మంచి మేలు చేస్తుంది. తేలికపాటి పుల్లని రుచి ఉండి సహజ శీతలీకరణ ప్రభావం కలిగివుంటుంది. ఇది వేసవిలో ఒక గొప్ప ఎంపిక. సాధారణంగా ఐస్ టీగా తాగడానికి దీనిని ఇష్టపడతారు.
కుకుంబర్ మింట్ టీ
వేసవిలో దోసకాయ మన ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలను తెస్తుందో మనందరికీ తెలిసిందే. సలాడ్ కాకుండా.. మీరు టీ రూపంలో కూడా దీనని మీ ఆహారంలో భాగం చేసుకోవచ్చు. కుకుంబర్ మింట్ టీ వేసవిలో మిమ్మల్ని హైడ్రేట్ చేస్తుంది.
పిప్పరమింట్ టీ
పిప్పరమింట్ టీ కూడా వేడి నుండి మిమ్మల్ని రక్షించడంలో సహాయపడుతుంది. ఇది తాజా రుచికి, శీతలీకరణ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. అందుకే వేసవి కాలంలో ఇది ప్రసిద్ధ పానీయంగా పరిగణించబడుతుంది. ఇది జీర్ణక్రియను శాంతపరచడానికి.. వేడి నుండి ఉపశమనాన్ని అందించడానికి కూడా సహాయపడుతుంది.