వృద్ధుడి కడపులో 6 వేల రాళ్లు.. విజయవంతంగా తొలగించిన వైద్యులు

రాజస్థాన్‌లోని కోటాలో ఒక ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు 70 ఏళ్ల వృద్ధుడి పిత్తాశయం నుండి 6,110 రాళ్లను తొలగించారు.

By అంజి  Published on  9 Sept 2024 11:25 AM IST
Rajasthan, stones, surgically removed, gallbladder, Kota

వృద్ధుడి కడపులో 6 వేల రాళ్లు.. విజయవంతంగా తొలగించిన వైద్యులు

రాజస్థాన్‌లోని కోటాలో ఒక ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు 70 ఏళ్ల వృద్ధుడి పిత్తాశయం నుండి 6,110 రాళ్లను తొలగించారు. బుండి జిల్లా పదంపురకు చెందిన వృద్ధ రోగి కడుపు నొప్పి, గ్యాస్, ఉబ్బరం, వాంతులు వంటి లక్షణాలతో 18 నెలలుగా ఇబ్బంది పడ్డాడు. గతంలో కోటలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందగా, అక్కడ ఓపెన్ సర్జరీ చేయించుకోవాలని సూచించారు. గత వారం, సెప్టెంబరు 6న, ఆ వ్యక్తి సోనోగ్రఫీని చేయించుకున్నాడు.

పిత్తాశయం పూర్తిగా రాళ్లతో నిండిపోయి 12x4 సెంటీమీటర్ల పరిమాణంతో కనిపించింది. ఇది అతని అసౌకర్యానికి ప్రధాన కారణమని లాపరోస్కోపిక్ సర్జన్ డాక్టర్ దినేష్ జిందాల్ తెలిపారు. దీంతో లాపరోస్కోపిక్‌ శస్త్రచికిత్స చేయడం సవాలుగా మారిందని, ఎండో బ్యాగ్‌ని ఉపయోగించి పిత్తాశయం తొలగించినట్టు వైద్యులు తెలిపారు. 30 నుంచి 40 నిమిషాల పాటు శష్త్ర చికిత్స చేసి రోగిని డిశ్చార్జ్‌ చేశారు.

"సాధారణంగా, పిత్తాశయం పరిమాణం సుమారు 7x4 సెం.మీ ఉంటుంది. పిత్తాశయం యొక్క పరిస్థితిని బట్టి, లాపరోస్కోపిక్ శస్త్రచికిత్స చేయడం సవాలుగా ఉండేది. పిత్తాశయం చిల్లులు కలిగి ఉంటే, రాళ్ళు పొత్తికడుపు అంతటా వ్యాపించి, సంక్రమణ ప్రమాదాన్ని పెంచుతాయి" డాక్టర్ జిందాల్ పేర్కొన్నారు. డాక్టర్ జిందాల్ ప్రకారం.. ఎండో-బ్యాగ్‌ని ఉపయోగించి పిత్తాశయం తొలగించబడింది. ఈ ప్రక్రియ దాదాపు 30 నుండి 40 నిమిషాలు పట్టింది. తొలగించిన తరువాత.. పిత్తాశయం తెరవబడింది. అనేక రాళ్లను బహిర్గతం చేసింది. ఆపరేషన్ తర్వాత రోగిని డిశ్చార్జ్ చేశారు.

Next Story