పురుషులతో పురుషుల లైంగిక సంబంధాలే మంకీపాక్స్ వ్యాప్తికి కారణం..!
Monkeypox cases concentrated among men who have sex with men. మంకీపాక్స్ వ్యాధి ప్రపంచాన్ని ఆందోళనలో పడేసింది.
By Medi Samrat Published on 24 July 2022 6:40 PM ISTమంకీపాక్స్ వ్యాధి ప్రపంచాన్ని ఆందోళనలో పడేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీపాక్స్ ను ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రాంతీయ డైరెక్టర్, డాక్టర్ పూనమ్ ఖేత్రపాల్ సింగ్ మాత్రం పురుషుల మధ్య లైంగిక సంబంధం కారణంగా మంకీపాక్స్ మరింత ఎక్కువవుతోందని అంటున్నారు. పురుషులతో లైంగిక సంబంధం కలిగి ఉన్న పురుషుల కారణంగా మంకీపాక్స్ మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉందని అన్నారు. మంకీపాక్స్‌పై నిఘా, ప్రజారోగ్య చర్యలను పటిష్టం చేయాలని WHO ఆదివారం ఆగ్నేయాసియా ప్రాంతంలోని దేశాలకు పిలుపునిచ్చింది. "మంకీపాక్స్ వేగంగా వ్యాపిస్తోంది. ఇంతకు ముందు చూడని అనేక దేశాలకు ఇది చాలా ఆందోళన కలిగించే విషయం. పురుషులతో లైంగిక సంబంధం కలిగి ఉన్న పురుషులలో కేసులు కేంద్రీకృతమై ఉంది, "అని ఆగ్నేయాసియా రీజియన్ రీజినల్ డైరెక్టర్ డాక్టర్ పూనమ్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా 75 దేశాల నుండి 16,000 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. WHO సౌత్-ఈస్ట్ ఆసియా రీజియన్‌లో, మంకీపాక్స్ నాలుగు కేసులు నమోదయ్యాయి. భారత్ నుండి నాలుగు మరియు థాయిలాండ్ నుండి ఒకటి నమోదైంది.
మంకీపాక్స్ వ్యాధి సోకిన వ్యక్తుల్లో 98 శాతం మంది గే లేదా బైసెక్సువల్ పురుషులేనని వెల్లడైంది. పురుషులతో పురుషులకు లైంగిక సంబంధాలే మంకీపాక్స్ వ్యాధి వ్యాప్తికి కారణమై ఉండొచ్చునని అంటున్నారు. 16 దేశాల్లో 528 మంకీపాక్స్ కేసులను విశ్లేషించిన పరిశోధకులు ఈ అంచనాకు వచ్చారు. ఈ ఏడాది ఏప్రిల్ 27- జూన్ 24 మధ్య 16 దేశాల్లోని 43 ప్రాంతాల్లో నమోదైన 528 మంకీపాక్స్ ఇన్ఫెక్షన్ కేసులను మేము పరిశీలించామని పరిశోధకులు అన్నారు. ఇందులో 98 శాతం వ్యక్తులు గే లేదా బైసెక్సువల్ పురుషులున్నారని పరిశోధకులు పేర్కొన్నారు. లైంగిక చర్య ద్వారానే వ్యాధి వ్యాప్తి జరుగుతోందనే అనుమానం కలుగుతోందన్నారు.
అమెరికాలో తొలిసారిగా చిన్నారుల్లోనూ మంకీపాక్స్ బయటపడటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికాలో నమోదైన కేసుల్లోనూ 99 శాతం కేసుల్లో గే లేదా బైసెక్సువల్ వ్యక్తులే ఉన్నట్లు నిర్ధారించారు.