బాదంతో మీ దీపావళి వేడుకలను ఆరోగ్యవంతంగా మలుచుకోండి
దీపకాంతుల పండుగ దీపావళి. ఆనందం మరియు ఉత్సాహంతో వేడుక జరుపుకోవడానికి ప్రియమైన వారిని ఒకచోట చేర్చుతుంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 25 Oct 2024 4:30 PM ISTదీపకాంతుల పండుగ దీపావళి. ఆనందం మరియు ఉత్సాహంతో వేడుక జరుపుకోవడానికి ప్రియమైన వారిని ఒకచోట చేర్చుతుంది. అయితే, ఈ పండుగ సమయం తరచుగా చక్కెరతో కూడిన విందులు, వేయించిన స్నాక్స్ మరియు పిండి పదార్ధాలు అధికంగా ఉండే ఆహారపదార్థాలను ఎక్కువగా తీసుకునేలా ప్రోత్సహిస్తుంది. వేడుకల సమయంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, బరువు పెరగడం మరియు రక్తంలో చక్కెర పెరుగుదలను నివారించడానికి ఈ రుచుల స్వీకరణ పట్ల జాగ్రత్త వహించడం చాలా అవసరం. బాదం వంటి పోషకమైన ఎంపికలను చేసుకోవటం ఆరోగ్యంపై రాజీ పడకుండా పండుగలను ఆస్వాదించడానికి సమర్థవంతమైన మార్గం. వీటిని నేరుగా లేదా వివిధ వంటకాలకు జోడించడం ద్వారా ఆస్వాదించవచ్చు.
బాదంపప్పులో ప్రోటీన్, కాల్షియం, జింక్, డైటరీ ఫైబర్ మరియు మెగ్నీషియం వంటి 15 ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి, ఇవి మొత్తం ఆరోగ్యంను కాపాడుతూ అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. వాటిలోని అధిక ఫైబర్ మరియు ప్రొటీన్ ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచడంలో సహాయపడతాయి, అతిగా తినాలనే కోరికను అరికడతాయి. ఇది సమతుల్య మరియు ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా చేసుకోవడానికి వాటిని అద్భుతమైన ఎంపికగా మారుస్తుంది. ప్రోటీన్ అధికంగా ఉండటం వల్ల బాదం కండరాల పెరుగుదల మరియు నిర్వహణకు తోడ్పడుతుంది. అదనంగా, ప్రతి రోజూ ఒక గుప్పెడు బాదంపప్పులను తీసుకోవడం వల్ల అవి కార్బోహైడ్రేట్ ఆహారాల ప్రభావాన్ని తగ్గించడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.
ఈ గింజలలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంది, ఇది చర్మ ఆరోగ్యాన్ని ప్రోత్సహించే యాంటీ ఏజింగ్ లక్షణాలకు ప్రసిద్ధి. వాస్తవానికి, ఆయుర్వేదం, సిద్ధ మరియు యునాని గ్రంథాలు చర్మకాంతిని పెంచడంలో బాదం యొక్క పాత్రను హైలైట్ చేశాయి.
న్యూట్రిషన్ అండ్ వెల్‌నెస్ కన్సల్టెంట్ షీలా కృష్ణస్వామి, మాట్లాడుతూ, “దీపావళి ఆనందం మరియు వేడుకల సమయం, అయితే ఈ సమయంలో కోరికలను అదుపులో వుంచుకోవడం చాలా అవసరం. బాదం వంటి పదార్ధాలను ఆహారంలో చేర్చడం, శుద్ధి చేసిన చక్కెరను ఖర్జూరం వంటి సహజ స్వీటెనర్‌లతో భర్తీ చేయడం చేయవచ్చు " అని అన్నారు.
బాలీవుడ్ సెలబ్రిటీ మరియు నటి సోహా అలీ ఖాన్ మాట్లాడుతూ, " పండుగలు మనల్ని దగ్గర చేస్తున్నప్పుడు, ఆరోగ్యకరమైన విందులను ఎంచుకోవడం ఉత్తమం. పౌష్టికాహారం కలిగిన బాదంపప్పులు మనల్ని ఎక్కువసేపు సంతృప్తిగా ఉంచుతాయి, అనవసరమైన చిరుతిళ్లను అరికట్టడంతోపాటు బరువు నిర్వహణకు తోడ్పడతాయి" అని అన్నారు.
మ్యాక్స్ హెల్త్‌కేర్, న్యూ ఢిల్లీ, రీజనల్ హెడ్ – డైటెటిక్స్, రితికా సమద్దర్ మాట్లాడుతూ “ బాదం వంటి పదార్ధాలను ఎంచుకోవడం ద్వారా మీరు పండుగ సమయంలో కూడా ట్రీట్‌లను ఆస్వాదించవచ్చు. ఇటీవలే విడుదలైన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ICMR-NIN) నివేదిక సమతుల ఆహారంలో భాగంగా బాదం వంటి గింజలను క్రమం తప్పకుండా తినాలని సిఫార్సు చేస్తుంది" అని అన్నారు.
ఫిట్‌నెస్ కోచ్ మరియు పిలాట్స్ మాస్టర్ యాస్మిన్ కరాచీవాలా మాట్లాడుతూ, “ ఈ సమయంలో ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంచుకోవాలని నేను సిఫార్సు చేస్తున్నాను. మీ దీపావళి భోజనంలో బాదం వంటి ఆరోగ్యకరమైన ఆహారాలను జోడించడం వల్ల ఆరోగ్యకరమైన శక్తిని కూడా అందిస్తుంది" అని అన్నారు.
పోషకాహార నిపుణులు డాక్టర్ రోహిణి పాటిల్ మాట్లాడుతూ, “దీపావళి సీజన్‌లో అతిగా తినడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. నిజంగా పండుగల సీజన్‌ను సద్వినియోగం చేసుకోవాలంటే, మనం తినే వాటిపై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. బాదం వంటి ఆరోగ్యకరమైన ఎంపికలతో దీపావళి సంబరాలను ఆస్వాదిద్దాం !” అని అన్నారు.
దక్షిణ భారత నటి శ్రియా శరణ్ మాట్లాడుతూ, "సంవత్సరంలో నాకు ఇష్టమైన సమయాలలో దీపావళి ఒకటి. కానీ నటిగా, నేను నా ఆహార ఎంపికల గురించి కూడా జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా సుదీర్ఘ షూటింగ్ రోజులలో బాదం గింజలు నా బరువును అదుపులో ఉంచుకోవడానికి మరియు ఆకలిని అరికట్టడానికి సహాయపడతాయి" అని అన్నారు.
స్కిన్ ఎక్స్‌పర్ట్ మరియు కాస్మోటాలజిస్ట్ డాక్టర్ గీతికా మిట్టల్ మాట్లాడుతూ, "రుచికరమైన పండుగ భోజనం మరియు స్నాక్స్ తినాలని కోరిక ఉన్నప్పటికీ, సరికాని ఆహారంతో బరువు పెరగడం వంటి అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. భోజనంలో బాదం వంటి పోషకాలను చేర్చడం చాలా అవసరం. ఇది చర్మ ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది మరియు మీ సహజమైన మెరుపును అందిస్తుంది" అని అన్నారు
ఆయుర్వేద నిపుణులు , డాక్టర్ మధుమిత కృష్ణన్, మాట్లాడుతూ " ఆయుర్వేద, సిద్ధ మరియు యునాని గ్రంథాలలో, బాదం చర్మ కాంతిని పెంపొందించడంలో ప్రయోజనకరమైనదిగా గుర్తించబడింది. బాదం శరీర కణజాలాలకు తేమను అందించడానికి, నాడీ వ్యవస్థకు మద్దతునిస్తుంది, చర్మం రంగును మెరుగుపరచడంలో సహాయపడుతుంది" అని అన్నారు
ప్రముఖ దక్షిణ భారత నటి వాణి భోజన్ మాట్లాడుతూ, “దీపావళి నాకు ఇష్టమైన పండుగ. అయితే, ఇప్పుడు వినోద పరిశ్రమలో ఉన్నందున ఆహరం గురించి జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. దీపావళికి వంటలలో ఆల్మండ్ బర్ఫీ ఒకటి. ఇది పోషకమైనది మరియు సులభంగా తయారుచేయతగినది" అని అన్నారు
ఈ దీపావళి వేళ, రుచికరమైన మరియు పోషకమైన భోజనం, స్వీట్లు మరియు స్నాక్స్‌ను ఆస్వాదిస్తూ మీ ప్రియమైనవారితో నాణ్యమైన సమయాన్ని గడపడానికి ప్రాధాన్యత ఇవ్వండి. మీ వేడుకల్లో కొన్ని బాదంపప్పులను చేర్చడం ద్వారా, మీరు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు.