బాదముతో గుండెను ఆరోగ్యవంతంగా చేసుకోండి

Make heart healthy with almonds. ప్రతి సంవత్సరం 29 సెప్టెంబర్‌ ను ప్రపంచ హృదయ దినోత్సవంగా జరపడం ద్వారా కార్డియో వాస్క్యులర్‌ వ్యాధులు

By Medi Samrat  Published on  21 Sep 2022 5:31 AM GMT
బాదముతో గుండెను ఆరోగ్యవంతంగా చేసుకోండి

ప్రతి సంవత్సరం 29 సెప్టెంబర్‌ ను ప్రపంచ హృదయ దినోత్సవంగా జరపడం ద్వారా కార్డియో వాస్క్యులర్‌ వ్యాధులు (సీవీడీ) మరియు వాటి ప్రభావం పట్ల ప్రపంచ వ్యాప్తంగా అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మరణాలకు కారణమవుతున్న శక్తివంతమైన హంతకిగా సీవీడీ నిలుస్తుంది. ఈ వ్యాధుల భారం గణనీయంగా పెరుగుతుంది. నిపుణుల అంచనా ప్రకారం 2030 నాటికి ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక సీవీడీ మరణాలు భారతదేశంలో నమోదుకానున్నాయి. రాబోతున్న ఆరోగ్య సంక్షోభాన్ని గుర్తించి, ఎదుర్కోవాలనే ప్రయత్నాలలో భాగంగా ఈ సంవత్సరం ప్రపంచ హృదయ దినోత్సవ నేపథ్యంగా 'యూజ్‌ హార్ట్‌ ఫర్‌ ఎవ్రీ హార్ట్‌'(ప్రతి గుండె కోసం గుండెను వినియోగించండి)ను ఎంచుకున్నారు. ఈ నేపథ్యం సీవీడీలను అత్యవసరంగా నిర్వహించాల్సిన తీరు , వాటిని అడ్డుకునే అవకాశాలు మరియు స్పందిస్తోన్న ప్రతి హృదయానికీ అవసరమైన రీతిలో కార్డియోవాస్క్యులర్‌ వ్యాధులను ఎదుర్కోవడానికి ప్రణాళికలను పునర్నిర్వచించడాన్ని ప్రతిబింబిస్తుంది.

కొవిడ్‌ మహమ్మారి మనకు తిరిగి చూసుకునే అవకాశం కల్పిండంతో పాటుగా మన ప్రాధాన్యాతలు, జీవనశైలిని పునః పరిశీలించుకునే అవకాశం కూడా కల్పించింది. మనందరికీ తెలిసిన సత్యం, మనం తీసుకునే ఆహారమే, మన ఆరోగ్యాన్ని నిర్ధేశిస్తుంది అని ! ఆరోగ్యంగా మరియు ఫిట్‌గా ఉండటంలో ఆహారం యొక్క ప్రాముఖ్యతను ఇది వెల్లడిస్తుంది. అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ జర్నల్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం వెల్లడించే దాని ప్రకారం ప్రతి రోజూ 42 గ్రాముల బాదములను స్నాక్‌గా తీసుకుంటే, అంటే తమ ఆరోగ్య వంతమైన డైట్‌లో భాగంగా చేసుకుంటే, అది గుండె సంబంధిత వ్యాధుల ప్రభావాన్ని తగ్గిస్తుంది. అదనంగా, బాదములను స్నాకింగ్‌ను తీసుకుంటే గుండె వ్యాధులకు కారణమయ్యే కారణాలైన ఉదరం దగ్గర చేరే కొవ్వు తగ్గుతుంది మరియు వెయిస్ట్‌ పరిమాణం కూడా తగ్గుతుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ ఆలోచనాత్మకమైన రీతిలో ఆరోగ్యవంతమైన డైట్‌ను ఎంచుకోవాలి. దీనిలో ఓ గుప్పెడు బాదములు జోడించుకోవాలి. బాదములలో వైవిధ్యమైన పోషకాలు కూడా ఉంటాయి. ఇవి గుండెకు ఆరోగ్యాన్ని అందిస్తాయి.

గుండె ఆరోగ్యాన్ని నిర్వహించడంలో ఫిట్‌నెస్‌ పాత్రను గురించి ఫిట్‌నెస్‌, సెలబ్రిటీ ఇన్‌స్ట్రక్టర్‌ యాస్మిన్‌ కరాావాలా మాట్లాడుతూ '' క్రమం తప్పని వ్యాయామం, చురుకైన జీవనశైలి వంటివి గుండె ఆరోగ్యానికి కీలకం. వ్యాయాయాల వల్ల ఎండోమార్ఫిన్లు మరియు డోపమైన్‌ విడుదలవుతాయి. తద్వారా ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మీ శరీరానికి ఉపయోగపడే రీతిలో వ్యాయాయాలను గురించి తెలుసుకునేందుకు నిపుణులను సంప్రదించండి. అంతేకాదు, మీ షెడ్యూల్‌లో కనీసం 30 నిమిషాలు ఈ వ్యాయామాల కోసం కేటాయించండి. చురుకైన జీవనశైలికి కట్టుబడి ఉండటంతో పాటుగా ఆరోగ్యవంతమైన, తగిన శక్తిని అందించే బాదములు లాంటి ఆహారాన్ని డైట్‌లో జోడించుకోండి. బాదములలో విస్తృత శ్రేణిలో పోషకాలు ఉన్నాయి. ఇవి కడుపు నిండిన అనుభూతులనూ అందిస్తాయి''అని అన్నారు.

న్యూట్రిషన్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌ షీలా కృష్ణస్వామి మాట్లాడుతూ '' యువతలో సీవీడీ కేసులు పెరుగుతున్నాయి. సీవీడీ రిస్క్‌ ఫ్యాక్టర్స్‌ అయినటువంటి ఊబకాయం, హైపర్‌టెన్షన్‌,మధుమేహం వంటివి భారతీయులలో అత్యధికం. ఆఖరకు యువత, సంప్రదాయ గ్రూప్‌లలో కూడా ఈ సమస్య ఉంది. దీనిని ఖచ్చితంగా అధికమించాల్సి ఉంది. దీనికి ఆరోగ్యవంతమైన జీవన విధానం ఎంచుకోవాలి. చురుకుగా ఉండటంతో పాటుగా వర్కవుట్స్‌ కూడా చేయాలి. ఆరోగ్యంగా ఉండేందుకు ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవడం కూడా అవసరం. మీరు ఏం తింటున్నారనేది తెలుసుకోవడం ముఖ్యం. అలాగే ఆ ఆహారం మీ శరీరంపై చూపే ప్రభావం తెలుసుకోవడమూ కీలకం. కొలెస్ట్రాల్‌, సోడియం, కొవ్వు మరియు చక్కెర అధికంగా ఉండే ఆహారాలకు బదులుగా ఆరోగ్యవంతమైన అవకాశాలను ఎంచుకోవాలి. మీ ఆరోగ్యవంతమైన డైట్‌లో బాదములను భాగంగా చేసుకోండి. ఇది సీవీడీ ప్రమాదాలను తగ్గించవచ్చు. అత్యధిక ఎల్‌డీఎల్‌ కొలెస్ట్రాల్‌, ట్రై గ్లిసరైడ్‌ స్ధాయిలు మరియు లో హెచ్‌డీఎల్‌ కొలెస్ట్రాల్‌ స్థాయిలకు కారణమయ్యే డిస్లిపిడెమియాను భారతీయులునియంత్రణలో ఉంచుకునేందుకు బాదములు కొంత మేర సహాయపడతాయి'' అని అన్నారు.


Next Story