ఎంత ఫిట్ గా ఉన్నా, ఎంత మంచి డైట్ మెయిన్టైన్ చేస్తున్నా కొన్ని కొన్ని సార్లు బెడ్ మీద మగవాళ్లు అనుకున్నంత ప్రదర్శన చేయలేకపోవచ్చు. అయితే అందుకు ఓ విటమిన్ కూడా కారణమని అంటున్నారు నిపుణులు. అంగస్తంభన సమస్యతో బాధపడుతున్న వ్యక్తులు 'విటమిన్ డి' స్థాయిలను తనిఖీ చేసుకోవాలి.
నిరంతర అలసట, ఎముకల్లో నొప్పి, కండరాల బలహీనత, మానసిక స్థితిలో మార్పులు విటమిన్ డి లోపంతో ముడిపడి ఉన్నాయి. విటమిన్ డి తక్కువ స్థాయిలో ఉంటే మీ పడకగది పనితీరుపై ప్రభావం చూపుతుందని ఇటీవలి అధ్యయనం సూచిస్తుంది. బ్రిటిష్ జర్నల్ ఆఫ్ ఫార్మకాలజీలో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం విటమిన్ డి లోపం, అంగస్తంభనల్లో తేడాల మధ్య ముఖ్యమైన సంబంధాన్ని వెల్లడించింది. తక్కువ విటమిన్ డి స్థాయిలు ఎముక, రోగనిరోధక శక్తిపై ప్రభావం చూపడమే కాకుండా లైంగిక పనితీరును కూడా దెబ్బతీస్తాయని సూచిస్తున్నాయి. ఈ అధ్యయనంలో విటమిన్ డి గ్రాహకాలు పురుషాంగ మృదు కండరాల కణాలలో కేంద్రీకృతమై ఉన్నాయని కూడా తేలింది.