ఎండాకాలంలో నిమ్మరసం తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. నిమ్మతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. వేసవి తాపాన్ని తగ్గించి శరీరానికి తక్షణ శక్తినిస్తుంది. విటమిన్‌ బీ, సీ యాంటీ ఆక్సిడెంట్లు, కాల్షియం ఆరోగ్యాని ఎంతో మేలు చేస్తాయి. అయితే మరకలను పొగొట్టడంతో పాటు ఇంట్లో ఇంకా చాలా పనులకు నిమ్మరసం ఎంతగానో ఉపయోగపడుతుంది.

దోమ‌ల నివార‌ణ‌

మార్కెట్లో లభించే మస్కిటో కాయిల్స్‌ వాసనలు చాలా మందికి పడవు. వీటి వల్ల కొందరికి అలర్జిలు కూడా వస్తుంటాయి. అలంటప్పుడు సహజసిద్దంగా నిమ్మరసంతో దోమలు రాకుండా చేయవచ్చు. ఇందు కోసం ఒక గిన్నెలో నిమ్మరసం తీసుకుని అందులో కొన్ని లవంగాలు వేసి బెడ్‌ రూమ్‌లో లేదా హాల్‌లో ఒక మూలన పెడితే దోమల బెడద ఉండదు.

అలాగే సువాసనకు రూం ఫ్రెషర్‌గా కూడా నిమ్మరసాన్ని వాడుకోవచ్చు. కొన్ని నీళ్లలో నిమ్మ తొక్క లేదా నిమ్మరసం వేసి మరిగించడం ద్వారా ఇల్లు మొత్తం సువాసన నిండుతుంది. చాలా ఫ్రెష్‌గా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది.

కిచెన్‌, బాత్‌రూమ్‌ శుభ్రతకు..

వంట గది, బాత్‌ రూమ్‌ శుభ్రం చేయడానికి కూడా నిమ్మరసాన్ని ఉపయోగించవచ్చు. నిమ్మరసం నీళ్లను సమపాళ్లలో ఒక సీసాలోకి తీసుకోవాలి. దానిని స్పే చేస్తూ వంట గది, బాత్‌ రూమ్‌ , ఫ్రిజ్‌పై మరకలను శుభ్రం చేసుకోవచ్చు.

చాపింగ్‌ బోర్డు క్లీన్‌ చేయడానికి..

రోజు కూరగాయాలు, పండ్లు కట్‌ చేయడం వల్ల చాపింగ్ బోర్డుపై మరకలు అవుతుంటాయి. ఆ మరకలు పోగొట్టేందుకు నిమ్మ తొక్కతో చాపింగ్‌ బోర్డును గట్టిగా రుద్దితే మరకలు పోయి శుభ్రమవుతుంది.

దంతాల శుభ్రతకు..

పసుపు పచ్చగా మారిన పళ్లను శుభ్రం చేయడంలో నిమ్మరసం చక్కగా ఉపయోగపడుతుంది. బేకింగ్‌ సోడాలో కొద్దిగా నిమ్మరసం కలిపి ఆ మిశ్రమంతో పళ్లను శుభ్రం చేసుకున్నట్లయితే ఎంతో మేలు జరుగుతుంది. పళ్లు తెల్లగా మారి తళతళలాడుతాయి. అలాగే యాపిల్‌ పండ్లను కోసిన తర్వాత నల్లగా మారిపోతుంటాయి. అలా కలర్‌ మారిన పండ్లపై నిమ్మరసం చల్లితే యాపిల్‌ తాజాగా ఉంటుంది.

క్రిములు, కీట‌కాల నివార‌ణ‌కు

క్రిములు, కీటకాల నివారణకు కూడా నిమ్మరసం ఎంతగానో ఉపయోగపడుతుంది. దీని కోసం ఏదైనా నూనెలో కొద్దిగా నిమ్మరం కలిపి బాగా షేక్‌ చేసి మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. దానిని ఓ బాటిల్‌లో నింపి కావాల్సిన చోట స్పే చేస్తే ఆ ప్రాంతంలోని కీటకాలను నివారించవచ్చు.
సామ్రాట్

Next Story