బాదంతో మీ హృదయాన్ని ఆరోగ్యంగా, సంతోషంగా ఉంచండి

ప్రపంచ హృదయ దినోత్సవం ను ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29న జరుపుకుంటారు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  24 Sep 2024 10:00 AM GMT
బాదంతో మీ హృదయాన్ని ఆరోగ్యంగా, సంతోషంగా ఉంచండి

ప్రపంచ హృదయ దినోత్సవం ను ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29న జరుపుకుంటారు. ఈ రోజున, ఆరోగ్య సంరక్షణ ప్రదాతలు, ప్రభుత్వ సంస్థలు మరియు అంతర్జాతీయ సంస్థలు కలిసి హృదయ సంబంధ వ్యాధుల (సివిడి లు) గురించి అవగాహన పెంచడానికి మరియు, ఆ వ్యాధి పరిస్థితులను నివారించడానికి, ముందుగా సమస్యను గుర్తించడానికి మరియు చికిత్స పొందటానికి చర్యలను ప్రోత్సహించటానికి ప్రయత్నిస్తుంటారు. ఇటీవలి సంవత్సరాలలో, భారతదేశం సివిడి కేసులలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తుంది. 45 మరియు అంతకంటే ఎక్కువ వయస్సు గల 65,562 మంది భారతీయ పెద్దలు పాల్గొన్న ఇటీవలి అధ్యయనంలో 29.4% స్వీయ-నివేదిత హృదయ సంబంధ వ్యాధుల ప్రాబల్యాన్ని వెల్లడించారు, అత్యవసర ప్రజారోగ్య సమస్యలు మరియు నివారణ కార్యక్రమాల అవసరాన్ని ఇది హైలైట్ చేసింది. గుండె ఆరోగ్యానికి తోడ్పడే ఒక ప్రభావవంతమైన మార్గం ఏమిటంటే మన రోజువారీ ఆహారంలో బాదం వంటి గుండె-ఆరోగ్యకరమైన ఆహారాలను చేర్చడం.

గుండె జబ్బులకు వ్యతిరేకంగా జరిపే పోరాటంలో బాదం ఒక శక్తివంతమైన తోడ్పాటుగా ఉంటుంది. ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, జింక్, డైటరీ ఫైబర్, మెగ్నీషియం మరియు పొటాషియంతో సహా 15 ముఖ్యమైన పోషకాలతో హృదయానికి ప్రయోజనాన్ని బాదం అందిస్తుంది. కొన్ని బాదంపప్పులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. చక్కటి సమతుల్య ఆహారంలో కొన్ని బాదంపప్పులను చేర్చడం, గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి మరియు కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించడానికి ప్రయోజనకరమైన అలవాటుగా చెప్పవచ్చు.

ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా బాలీవుడ్ నటి, సోహా అలీ ఖాన్ మాట్లాడుతూ, "ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం మరియు చురుకుగా ఉండటం గుండె ఆరోగ్యానికి చాలా అవసరం. మా కుటుంబ ఆహార ఎంపికల గురించి నేను ఎల్లప్పుడూ శ్రద్ధ వహిస్తాను, మేము జంక్ ఫుడ్‌ను పరిమితం చేయటం తో పాటుగా బాదంపప్పుల వంటి ఆరోగ్యకరమైన ఎంపికలను ఎంచుకుంటాము; నా గుండె ఆరోగ్యానికి తోడ్పడేందుకు యోగా, పైలేట్స్ లాంటి వ్యాయామాలు చేస్తాను " అని అన్నారు.

ప్రముఖ దక్షిణ భారత నటి, శ్రియా శరణ్ , ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా తన ఆలోచనలను పంచుకుంటూ “ఈ రోజున, ప్రతి ఒక్కరూ తమ రోజువారీ జీవితంలో ఆరోగ్యకరమైన ఎంపికలు చేయడం ద్వారా గుండె ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని నేను ప్రతి ఒక్కరినీ ప్రోత్సహిస్తున్నాను. ఆరోగ్యంపై అవగాహన ఉన్న వ్యక్తిగా, నేను పోషకమైన ఎంపికలు చేయడంపై దృష్టి సారిస్తాను. బాదం వంటి హృదయ ఆరోగ్యకరమైన స్నాక్స్‌ను నా ఆహారంలో చేర్చుకుంటాను. ." అని అన్నారు

పోషకాహార నిపుణులు డాక్టర్ రోహిణి పాటిల్ మాట్లాడుతూ, “మన ఆహారం మరియు జీవనశైలి ఎంపికలు గుండె ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో గుర్తించడం చాలా కీలకం. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, అధిక ఒత్తిడి స్థాయిలు, నిద్రలేమి మరియు నిశ్చల జీవనశైలి వంటివి స్థూలకాయం, గుండె సమస్యలు మరియు మధుమేహానికి కారణమవుతాయి. బాదం, కాలానుగుణ పండ్లు, కూరగాయలు మరియు లీన్ ప్రోటీన్లు వంటి గుండె-ఆరోగ్యకరమైన ఎంపికలు గణనీయమైన తేడాను కలిగిస్థాయి " అని అన్నారు

న్యూట్రిషన్ అండ్ వెల్‌నెస్ కన్సల్టెంట్ షీలా కృష్ణస్వామి మాట్లాడుతూ, “ఇటీవలి సంవత్సరాలలో భారతదేశంలో గుండెపోటు కేసులు గణనీయంగా పెరిగాయి, తగినంత నిద్ర మరియు ఒత్తిడి నిర్వహణ వంటి అంశాలు గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషిస్తాయి. మీ ఆహారంలో బాదంపప్పును చేర్చుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడవచ్చు, అలాగే గుండెకు హాని కలిగించే మంటను తగ్గించవచ్చు " అని అన్నారు

ఢిల్లీలోని మ్యాక్స్ హెల్త్‌కేర్ రీజినల్ హెడ్-డైటెటిక్స్ రితికా సమద్దర్ మాట్లాడుతూ, “భారతదేశంలో అల్పాహారం ఒక సాధారణ పద్ధతి, కానీ చాలా మంది ప్రజలు తమ గుండె మరియు శరీరానికి హాని కలిగించే అనారోగ్యకరమైన ఎంపికలను ఎంచుకుంటారు. మనం తినే వాటిపై శ్రద్ధ వహించడం చాలా అవసరం. వేయించిన లేదా నూనెతో కూడిన చిరుతిళ్లకు బదులుగా, కొన్ని బాదంపప్పులు పోషకమైన మరియు గుండె-ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తాయి. సమతుల్య ఆహారంలో భాగంగా బాదం వంటి గింజలను క్రమం తప్పకుండా తినాలని సిఫార్సు చేస్తున్నాను" అని అన్నారు.

ప్రముఖ దక్షిణ భారత నటి, వాణీ భోజన్ మాట్లాడుతూ "నేను ఎల్లప్పుడూ నా భోజనాన్ని ముందుగానే ప్లాన్ చేసుకుంటాను, బాదం వంటి పోషక విలువలు కలిగిన ఆహారాలను కలిగి ఉండేలా చూసుకుంటాను. రక్తంలో చక్కెరను నియంత్రించడంలో మరియు బరువును నియంత్రించడంలో అవి సహాయపడతాయి, నేను యోగా ద్వారా మానసిక ఒత్తిడిని కూడా నిర్వహిస్తాను గుండె ఆరోగ్యాన్ని మరియు మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇది చాలా అవసరం" అని అన్నారు

ఈ ప్రపంచ హృదయ దినోత్సవం పురస్కరించుకుని , బాదం వంటి పోషకమైన ఆహారాన్ని స్వీకరించండి, చురుకుగా ఉండండి మరియు మొత్తం శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వండి.

Claim Review:Keep your heart healthy and happy with almonds
Claim Fact Check:False
Next Story