ఈ సులభమైన పద్ధతులతో మీ 'టీ' పొడిలో కల్తీని గుర్తించండి..!
ఆహార పదార్థాల్లో కల్తీ అనేది సర్వసాధారణమైపోయింది. టీ పొడి కూడా (టీ లీవ్స్ అడల్టరేషన్) కల్తీ బారిన పడిందనేది తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు
By Medi Samrat Published on 7 Oct 2024 9:41 PM ISTఆహార పదార్థాల్లో కల్తీ అనేది సర్వసాధారణమైపోయింది. టీ పొడి కూడా (టీ లీవ్స్ అడల్టరేషన్) కల్తీ బారిన పడిందనేది తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అవును.. ఇనుప పొడి, పొడి ఆవు పేడ, చెక్క రంపపు పొడి, రంగు వంటి వాటిని కలిపి టీ పొడిని కల్తీ చేస్తున్నారు. దీని కారణంగా శరీరం క్రమంగా వ్యాధులకు నిలయంగా మారుతుంది. అటువంటి టీ తాగడం వల్ల జీర్ణ సమస్యలు, అలర్జీలు వచ్చే ప్రమాదం ఉంది. టీ ఆకులలో కల్తీని ఇంట్లో కూర్చొని గుర్తించగల కొన్ని సులభమైన పద్ధతులను తెలుసుకుందాం.
టీ ఆకుల స్వచ్ఛతను తనిఖీ చేయడానికి సులభమైన మార్గం రంగు పరీక్ష. దీని కోసం మీరు ఒక పారదర్శక గ్లాస్ తీసుకొని అందులో నిమ్మరసం, కొన్ని టీ ఆకులు వేయాలి. కొంత సమయం తరువాత నిమ్మరసం పసుపు లేదా ఆకుపచ్చ రంగులోకి మారినట్లయితే.. మీ టీ ఆకులు స్వచ్ఛమైనవిగా భావించండి. కానీ దాని రంగు నారింజ లేదా ఇతర రంగులకు మారినట్లయితే టీ ఆకులు కల్తీ అని అర్థం చేసుకోండి.
టీ ఆకుల స్వచ్ఛతను టిష్యూ పేపర్‌ను ద్వారా కూడా పరీక్షించవచ్చు. ఒక టిష్యూ పేపర్‌పై రెండు చెంచాల టీ ఆకులను ఉంచి, దానిపై కొంచెం నీరు చల్లి ఈ టిష్యూ పేపర్‌ను ఎండలో ఆరబెట్టండి. టిష్యూ పేపర్‌పై రంగు మచ్చలు లేదా గుర్తులు కనిపిస్తే టీ ఆకులు కల్తీ అని అర్థం చేసుకోండి. నిజమైన టీ పొడి అయితే టిష్యూ పేపర్ శుభ్రంగా ఉంటుంది.
మీరు నకిలీ టీ ఆకులను చల్లని నీటి ద్వారా పరీక్షించవచ్చు. ఒక గ్లాసు చల్లటి నీటిలో రెండు చెంచాల టీ ఆకులను వేసి బాగా కలపాలి. టీ ఆకులు స్వచ్ఛమైనవి అయితే.. అది నెమ్మదిగా నీటిలోకి రంగును విడుదల చేస్తుంది.. రంగు చిక్కగా మారడానికి కొంత సమయం పడుతుంది. కానీ టీ ఆకులు నకిలీ అయితే ఒక నిమిషంలో నీటి రంగు మారుతుంది. ఇంట్లో కూర్చొని మీ టీ ఆకుల స్వచ్ఛతను తెలుసుకోవడానికి ఇది సులభమైన మార్గం.
స్వచ్ఛమైన టీ ఆకుల వాసన కూడా మనకు దాని స్వచ్ఛతను తెలియజేస్తుంది. మనం టీ ఆకుల వాసన చూసినప్పుడు అది తాజా.. సహజమైన వాసన వస్తుంది. కానీ ఏదైనా కృత్రిమ లేదా రసాయనాలు కలిసిన టీ పొడి వాసన చూసినట్లైతే అలా అనిపించకవపోవచ్చు. ఇది కూడా స్వచ్ఛతను గుర్తించడానికి ఓ మార్గం.