బీట్‌రూట్ జ్యూస్ తాగితే ఏమవుతుంది.. ఉపయోగాలేంటి..?
Impressive Health Benefits of Beetroot. బీట్‌రూట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందంటున్నారు వైద్య నిపుణులు.
By Medi Samrat
ఎక్కువ మంది బిట్‌రూట్ జ్యూస్ అంటే పెద్దగా ఇష్టపడరు. అంతేకాదు బిట్‌రూట్‌ను పచ్చిగా తినేందుకు కూడా ఇష్టపడరు. కానీ ఇందులో ఉన్న ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు. బీట్‌రూట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందంటున్నారు వైద్య నిపుణులు.అయితే బీట్‌రూమ్‌ను తినడం ఇష్టం లేని వారు, కనీసం దాని జ్యూస్‌ను ప్రతి రోజు ఉదయాన్నే పరగడుపునే తాగితే ఎన్నో ప్రయోజనాలున్నాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
రక్త హీనతతో బాధపడేవారికి..
బీట్‌రూట్ జ్యూస్ వల్ల రక్తహీనతతో బాధపడేవారికి మంచి ఔషధంగా పని చేస్తుంది. దీని వల్ల రక్తం తొందరగా తయారయ్యేందుకు ఉపయోగపడుతుంది. రక్తహీనత సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఇక రోజంతా నీరసంగా ఉండేవారు ఉదయం సమయంలో బీట్‌రూట్ జ్యూస్ తాగితే రోజంతా హుషారుగా ఉంటారు. అంతేకాదు శరీరానికి ఎంతో శక్తి అందుతుంది.
హైబిపీకి...
బీట్‌రూట్ హైబీపీ ఉన్నవారికి మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. బీట్‌రూట్‌లో ఉండే పొటాషియం హైబీపీని కంట్రోల్లో ఉంచేందుకు ఉపయోగపడుతుంది. అంతేకాదు గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. ఇక కొలెస్టాల్ అధికంగా ఉన్నవారు బీట్‌రూట్ జ్యూస్ తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఈ జ్యూస్ తాగడం వల్ల శరీరంలో ఉండే కొలెస్టాల్ కరిగిపోతుంది. అలాగే బరువు తగ్గేందుకు కూడా ఈ జ్యూస్ ఉపయోగపడుతుంది.
గర్భిణీ మహిళలు తాగితే..
కాగా, ఈ బీట్‌రూట్ జ్యూస్ తాగడం వల్ల గర్భిణీ మహిళలకు ఎంతో ఉపయోగపడుతుంది. ఈ జ్యూస్ తాగడం వల్ల వారి కడుపులో ఉండే బిడ్డకు ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా అందుతుంది. దీంతో కడుపులో పెరిగే బిడ్డ ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. లివర్ సమస్య ఉన్నవారికి కూడా ఈ జ్యూస్ మంచిగా పని చేస్తుంది. బీట్ రూట్ వల్ల లివర్ శుభ్రం అవుతుంది. లివర్‌లో ఉండే వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లిపోయేలా చేస్తుంది.
జ్ఞాపకశక్తి పెరుగుతుంది
ప్రతి నిత్యం బీట్‌రూట్, లేదా జ్యూస్ తాగడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుందని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఐరన్ తక్కువగా ఉన్న వారు రక్తహీనతకు గురవుతారు. ఈ బీట్‌రూట్ వల్ల ఐరన్ పెరుగుతుంది. బ్లడ్‌లో హిమోగ్లోబిన్ స్థాయి కూడా పెరుగుతుంది. శరీరంలో నిరసం లేకుండా చేస్తోంది. బీట్‌రూట్ ముక్కలు తిన్నా .. లేదంటే జ్యూస్ తాగినా మంచి ఉపయోగం ఉంటుంది.
శరీరానికి కావాల్సిన విటమిన్స్
కాగా, బీట్‌రూట్‌లో శరీరానికి కావాల్సిన చాలా విటమిన్స్ ఉంటాయి. బీ,సీ విటమిన్స్ పుష్కలంగా అందుతాయి. బీట్ రూట్‌లో కాల్షియంతో పాటు మెగ్నిషియం, పోటాషియం కూడా అధికంగా లభిస్తుంది. అలాగే చర్మ సంబంధిత వ్యాధులు కూడా రాకుండా కాపాడుతుంది. ఎముకల్ని గట్టిగా ఉంచే శక్తి కూడా బీట్ రూట్‌కు ఉంటుంది.