బాధాకరమైన పీరియడ్స్ కు కారణమేమిటి..? డాక్టర్ విమీ బింద్ర ఏం చెబుతున్నారు..

Hyderabad gynecologist is busting myths about painful periods. పీరియడ్స్ సమయంలో మహిళలు ఎంతో బాధను దిగమింగుతూ ఉంటారు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  3 Aug 2022 3:29 PM GMT
బాధాకరమైన పీరియడ్స్ కు కారణమేమిటి..? డాక్టర్ విమీ బింద్ర ఏం చెబుతున్నారు..

పీరియడ్స్ సమయంలో మహిళలు ఎంతో బాధను దిగమింగుతూ ఉంటారు. కానీ పైకి మాత్రం తమకు ఎలాంటి పెయిన్ లేదని చెబుతూ ఉంటారు. ఆ సమయాల్లో వైద్యుల సహాయం తీసుకోడానికి చాలా మంది ముందుకు రారు. మహిళల్లో ఉండే ఎన్నో అపోహలను పారద్రోలడానికి డాక్టర్ విమీ బింద్ర నడుంబిగించారు. మహిళల్లో పీరియడ్స్ సమయంలో ఎటువంటి నొప్పీ కలుగకుండా చేయాలని ENDOCUSADERS కో ఫౌండర్, గైనకాలజిస్ట్, లాపరోస్కోపిక్, రోబోటిక్ సర్జన్ డాక్టర్ విమీ బింద్ర ప్రయత్నిస్తూ ఉన్నారు.

ప్రసవానికి ముందు.. తరువాత.. పీరియడ్స్ సమయంలో బాధలను అనుభవించామని గైనకాలజిస్ట్‌లకు మహిళలు ఫిర్యాదు చేశారు. కోల్‌కతాలోని RG కర్ మెడికల్ కాలేజీలో 2005-2008లో గైనకాలజిస్ట్‌గా శిక్షణ పొందుతున్న సమయంలో డాక్టర్ విమీ బింద్రా చాలా వరకు గమనించారు. హైదరాబాద్‌లోని ఫెర్నాండెజ్ హాస్పిటల్‌లో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు.. మహిళలు చెబుతున్న బాధలను, సమస్యలను పరిష్కరించలేని అనేక సందర్భాలు ఉన్నాయని ఆమె వివరించారు. కానీ కొన్ని మాత్రమే అల్ట్రాసౌండ్, MRI చేసి పరిష్కరించామని అన్నారు. "మెడికల్ స్కూల్ లో గైనకాలజిస్టులకు ఎండోమెట్రియోసిస్ గురించి బోధిస్తారు, కానీ చికిత్స గురించి వివరంగా చెప్పరు. గైనకాలజీలో ఇదే ప్రత్యేకత" అని డాక్టర్ బింద్రా చెప్పారు.

బాధాకరమైన పీరియడ్స్ కు కారణమేమిటి?

ఎండోమెట్రియోసిస్, ఫైబ్రాయిడ్స్, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్, అరుదైన జన్యుపరమైన పరిస్థితుల కారణంగా బాధాకరమైన పీరియడ్స్ ఏర్పడతాయి. భారతదేశంలో ప్రతి సంవత్సరం ఒక మిలియన్ కంటే ఎక్కువ మంది మహిళల్లో ఎండోమెట్రియోసిస్ కనుగొనబడింది.

స్త్రీ గర్భాశయంలోని కణజాలాన్ని పోలిన కణజాలం.. దాని వెలుపల కూడా పెరిగే పరిస్థితి ఉంటుంది. అండాశయాలు, మూత్రనాళం, మల ప్రాంతాలలో పెరుగుదల గమనించవచ్చు. పెళ్లి చేసుకోవడం, పిల్లలు పుట్టడం వల్ల నొప్పి తగ్గుతుందని నమ్మేవారని డాక్టర్ బింద్రా చెప్పుకొచ్చారు. "గర్భధారణ ఋతు చక్రం ఆపివేస్తుంది. ఇది కణజాలాల వాపును ఆపివేస్తుంది. ఇదే వ్యాధికి నివారణ అని నమ్ముతారు. ఈ నమ్మకం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది." అని అన్నారు. రోగనిర్ధారణ, పరిశోధన పరిస్థితిని బాగా అర్థం చేసుకోవడానికి దారితీసింది.. అయితే మహిళల్లో అవగాహన లేకపోవడం ప్రధాన సమస్య అని అన్నారు.

రోగనిర్ధారణ చాలా ఆలస్యం అయ్యే అవకాశం కూడా ఉంటుంది. 7 నుండి 20 సంవత్సరాల వరకు ఉంటుంది. చాలా మంది మహిళలకు ఈ సమస్యపై అవగాహన లేకపోవడమే ఇందుకు కారణం. భారతదేశంలో వైద్య విధానాలు మారుతూ ఉన్నాయి. ఇక నిపుణులను తరువాతి దశల్లో సంప్రదిస్తున్నారు. డాక్టర్ బింద్రా వివరిస్తూ.."చాలా సందర్భాల్లో, ఎక్సిషన్ సర్జరీ అవసరం. గైనకాలజిస్ట్, యూరాలజిస్ట్, కొలొరెక్టల్ సర్జన్‌లతో కూడిన శిక్షణ పొందిన బృందం శస్త్రచికిత్సను నిర్వహిస్తుంది. ఫలితంగా పీరియడ్స్ సమయంలో నొప్పిని పూర్తిగా నిర్మూలించవచ్చు." అని అన్నారు.

అవగాహన ముఖ్యం:

డాక్టర్ బింద్రా గత ఎనిమిది సంవత్సరాలుగా ఆన్‌లైన్‌లో మహిళలకు పీరియడ్స్ గురించి వివరిస్తూ వస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా, ఆమె భారతదేశంలోనే కాకుండా USA, ఆఫ్రికా, యూరప్‌లోని మహిళలకు చేరువయ్యారు. ఇన్ని రోజులూ మౌనంగా బాధపడ్డ మహిళలకు వారి సమస్యను అర్థం చేసుకోవడానికి, సమస్యలను సరిదిద్దడానికి సహాయం చేశారు.

డాక్టర్ బింద్రా మాట్లాడుతూ, "ఇప్పటి వరకు మేము చాలా నగరాల్లో సమస్యల గురించి చర్చించాము.. కానీ చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది నిశ్శబ్దంగా బాధపడుతున్నారు. మహిళలకు త్వరగా సహాయం చేసేలా.. ప్రభుత్వ ప్రసూతి కేంద్రాల్లో ప్రభుత్వం దీనిని చేపట్టాలని మేము కోరుకుంటున్నాము." అని అన్నారు. "శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా వారి బాధలను తగ్గించడమే లక్ష్యం. ఇదే తమ విధి అని నమ్మి చాలా మంది ఏళ్ల తరబడి తమ బాధను చెప్పుకోలేకపోతున్నారు. ఆ ఆలోచనా విధానం మారాలని నేను కోరుకుంటున్నాను" అని డాక్టర్ బింద్రా చెప్పుకొచ్చారు.

ఆమె శక్తియుక్తులన్నింటినీ ఇందుకోసం ఆమె అంకితం చేశారు. ఎంతో మంది మహిళల నుండి ప్రశంసలు ఆమె అందుకొంటూ ఉన్నారు. మహిళల సందేశాలు, అందులో కనిపించే కృతజ్ఞతా భావం తనను మరింత ముందుకు వెళ్లడానికి పురికొల్పుతున్నాయని డాక్టర్ బింద్రా తెలిపారు.


Next Story