అధిక కొలెస్ట్రాల్‌ను ఇలా అదుపు చేయండి..!

How To Reduce High Cholesterol. అధిక కొలెస్ట్రాల్ సమస్య నేడు సర్వసాధారణంగా మారింది. దీనికి కార‌ణం మ‌న‌ జీవనశైలి కూడా ఓ కార‌ణం.

By Medi Samrat  Published on  24 April 2023 8:21 PM IST
అధిక కొలెస్ట్రాల్‌ను ఇలా అదుపు చేయండి..!

How To Reduce High Cholesterol


అధిక కొలెస్ట్రాల్ సమస్య నేడు సర్వసాధారణంగా మారింది. దీనికి కార‌ణం మ‌న‌ జీవనశైలి కూడా ఓ కార‌ణం. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, వ్యాయామం చేయకపోవడం, మద్యపానం, ధూమపానం, తగినంత నిద్ర లేకపోవడం వంటివి అధిక కొలెస్ట్రాల్ కు కార‌ణాలుగా చెప్పొచ్చు. ఈ అల‌వాట్లు ఉన్న వ్యక్తి హై బీపీ, డయాబెటిస్‌తో పాటు అధిక కొలెస్ట్రాల్ బారిన‌ప‌డే అవ‌కాశాలు ఎక్కువ‌. కొలెస్ట్రాల్ స్థాయి 200 ఎంజీ/డీఎల్‌ కంటే ఎక్కువగా ఉంటే.. ప్రమాదకరంగా పరిగణించబడుతుంది. అధిక కొలెస్ట్రాల్ బాధితులు అయితే.. మీరు కొన్ని విషయాలను జాగ్రత్తగా చూసుకోవాలి. లేదంటే పరిస్థితి చేయి దాటిపోతుంది. అధిక స్థాయి కొలెస్ట్రాల్ అనేక తీవ్రమైన వ్యాధులకు కారణమవుతుంది. కాబట్టి దీనిని తేలికగా తీసుకుని అల‌స‌త్వం ప్ర‌ద‌ర్శించ‌వ‌ద్దు.

ఎప్పటికప్పుడు బాడీ చెకప్ చేయించుకోవడం వల్ల సకాలంలో చికిత్స పొంద‌వచ్చు. మీరు అధిక కొలెస్ట్రాల్‌తో పోరాడుతున్నట్లయితే.. లిపిడ్ ప్రొఫైల్‌ను తనిఖీ చేసుకోవ‌డంతో పాటు రక్త పరీక్షలను కొనసాగించడం చాలా ముఖ్యం. మందులతో పాటు జీవనశైలిలో మార్పులు చేయ‌డం ద్వారా అధిక కొలెస్ట్రాల్ ని అదుపులోకి తీసుకురావచ్చు.

నిరంతరాయంగా ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కలిగే నష్టాలు మనందరికీ తెలుసు. దీని వ‌ల్ల‌ ఊబకాయం పెర‌గ‌డంతో పాటు శరీరంలో రక్తపోటు పెరుగుతుంది. ప్రతిరోజూ కాసేపు వ్యాయామం చేయడం ఎంత ప్రయోజనకరమో మనందరికీ తెలుసు. అయితే మనలో ఎంతమందికి వర్కవుట్ షెడ్యూల్ ఉంది? సాధారణంగా మందులు వాడితేనే కొలెస్ట్రాల్ నియంత్రణలోకి వస్తుందని అనుకుంటారు. మందులతో పాటు శారీరక శ్రమను కూడా పెంచడం అవసరం. కనీసం 150 నిమిషాల నడక వంటి శారీరక శ్రమ అధిక కొలెస్ట్రాల్‌తో ప్రమాదాన్ని తగ్గించగలదని పరిశోధనలు సూచిస్తున్నాయి.

ధూమపానం వ‌త్త‌ కొలెస్ట్రాల్ పెరుగుతుంద‌ని అనేక పరిశోధనలలో నిరూపించబడింది. ధూమపానం మానేయడం వల్ల మంచి కొలెస్ట్రాల్ స్థాయి అదుపులో ఉంటుంది. కొంచెం బరువు పెరిగినా, నిర్లక్ష్యం చేయకూడదు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, 4-5 కిలోల బరువు పెరగడం వల్ల శరీరంలో 10 ఎంజీ అదనపు కొలెస్ట్రాల్ ఉత్పత్తి అవుతుంది.

కొలెస్ట్రాల్‌ను ఎలా అదుపు చేయాలి?

కొలెస్ట్రాల్ అదుపుకుకు మందులతో పాటు జీవనశైలిలో మార్పులు అవసరం.

అలాగే ఎక్కువ సేపు కంటిన్యూస్‌గా కూర్చోకుండా మధ్యమధ్యలో విరామం తీసుకుని కొంతసేపు నడవాలి. మీరు పని వ‌త్తిడిలో మరచిపోతే.. ప్రతి 20-30 నిమిషాలకు అలారం సెట్ చేసుకోండి.

డెస్క్ జాబ్ ఉన్నవారు కొంత సమయం పాటు త‌ప్ప‌కుండా నడవాలి. మీరు నిలబడి ఫోన్ కాల్స్ మాట్లాడ‌టం, ఆన్‌లైన్ సమావేశాలకు హాజరవ‌డం వంటివి చేయ‌డం ద్వారా కొంత ఫ్రీ అయ్యే అవ‌కాశం ఉంది.


Next Story