Hormonal Imbalance : హార్మోన్లు గ‌తి త‌ప్పితే.. ఇలా కంట్రోల్ చేయండి..!

ఈ కాలంలో చిన్నవయసులోనే అనేక రకాల వ్యాధుల బారిన పడుతున్నారు. మధుమేహం, ఊబకాయం, మలబద్ధకం, అధిక రక్తపోటుతో పాటు హార్మోన్ల అసమతుల్యతతో యువ‌త బాధ‌ప‌డుతుంది

By Medi Samrat  Published on  22 April 2024 3:31 AM GMT
Hormonal Imbalance : హార్మోన్లు గ‌తి త‌ప్పితే.. ఇలా కంట్రోల్ చేయండి..!

ఈ కాలంలో చిన్నవయసులోనే అనేక రకాల వ్యాధుల బారిన పడుతున్నారు. మధుమేహం, ఊబకాయం, మలబద్ధకం, అధిక రక్తపోటుతో పాటు హార్మోన్ల అసమతుల్యతతో యువ‌త బాధ‌ప‌డుతుంది. హార్మోన్లు అసమతుల్యతతో శరీరంలో అనేక ఇతర సమస్యలు తలెత్తుతాయి. హార్మోన్ అసమతుల్యత అంటే శరీరంలో హార్మోన్ల ఉత్పత్తి ఎక్కువ లేదా తక్కువ ఉండ‌టం. మనలోని కొన్ని అలవాట్లు హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతాయి. మీరు ఆ అలవాట్లను మెరుగుపరుచుకుంటే.. హార్మోన్లను సులభంగా సమతుల్యం చేయవచ్చు. ఏ అలవాట్లు హార్మోన్ల అసమతుల్యతకు కారణమో ఇక్కడ తెలుసుకోండి.

బిజీ లైఫ్ స్టైల్, ఇంటి బాధ్యతలు, సోమరితనం కారణంగా, శారీరక శ్రమను విస్మరించడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. దీనివల్ల ఊబకాయం పెరగడమే కాకుండా హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. దీని వల్ల జీర్ణక్రియ, జుట్టు రాలడం, బరువు పెరగడం వంటి సమస్యలు కనిపిస్తాయి. మీరు దీని బారిన పడకూడదనుకుంటే రోజూ కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి.

ఎక్కువ ఒత్తిడి తీసుకోవడం కూడా హార్మోన్ స్థాయిలను మరింత దిగజార్చవచ్చు. కాబట్టి ఒత్తిడిని త‌గ్గించుకోండి. ఒత్తిడి నుండి ఉపశమనం పొందడానికి ప్రాణాయామం, యోగా, ధ్యానం మొదలైన వాటిని అభ్యసించండి.

జంక్, ఆయిల్ ఫుడ్స్, స్పైసీ ఫుడ్స్ తింటే బావుంటుందనిపిస్తుంది.. అయితే ఇవి మీ డైట్‌లో భాగమైతే అవి కూడా హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతాయి. హార్మోన్లను సమతుల్యంగా ఉంచడానికి ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోండి.

శరీరంలో సరైన హార్మోన్ల సమతుల్యతను కాపాడుకోవడానికి మంచి నిద్ర కూడా చాలా ముఖ్యం. ఆరోగ్యవంతమైన శరీరం కోసం రోజూ 7 నుండి 8 గంటల నిద్ర అవసరం. మీరు సరిగ్గా నిద్రపోకపోయినా.. అర్థరాత్రి వరకు మేల్కొని ఉన్నా.. శరీరంలో హార్మోన్ స్థాయి క్షీణించడం ప్రారంభమవుతుంది.

Next Story