చెమట వాసనను వదిలించుకునేందుకు ఈ చిట్కాలు పాటించండి

Home Remedies to Reduce Sweat Smell. వేసవి వచ్చిందంటే చెమటతో ఆందోళనకు గురవుతారు చాలామంది.

By Medi Samrat  Published on  7 April 2023 5:15 PM IST
చెమట వాసనను వదిలించుకునేందుకు ఈ చిట్కాలు పాటించండి

Home Remedies to Reduce Sweat Smell


వేసవి వచ్చిందంటే చెమటతో ఆందోళనకు గురవుతారు చాలామంది. కొందరు చెమట వాసనతో ఎక్కువ ఇబ్బంది ప‌డుతుంటారు. అలాంటివారిలో చంకల నుంచి చెమటలు వస్తున్నా, పాదాల నుంచి వచ్చినా.. దాని దుర్వాసనను తట్టుకోవడం చాలాసార్లు కష్టమవుతుంది. ఇటువంటి పరిస్థితుల‌లో ఇంటిలో చేసే కొన్ని చిట్కాలు మీకు సహాయపడతాయి. అవి చెమటలోని బ్యాక్టీరియాను చంపి వాసనను తగ్గిస్తాయి. చెమ‌ట వాసనను వదిలించుకోవడానికి కొన్ని ఇంటి చిట్కాల‌ గురించి తెలుసుకుందాం.

రాళ్ల ఉప్పు(క‌ల్లుప్పు) నీటితో స్నానం చేయడం వల్ల బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. ఇది క్రియాశీల బ్యాక్టీరియాను చంపుతుంది. అలాగే చెమట వాసనను తగ్గిస్తుంది. ఇది కాకుండా రాతి ఉప్పు(Rock Salt) ప్రత్యేకత ఏమిటంటే.. అది శరీరంపై మొటిమలను తగ్గించడంలో సహాయపడుతుంది. కాబట్టి.. స్నానం చేసే నీటిలో రాళ్ల ఉప్పు వేసి ఆ నీటితో స్నానం చేయండి.

వేప నీటితో స్నానం చేయడం వల్ల చెమట దుర్వాసన తగ్గుతుంది. వేప యాంటీ బాక్టీరియల్.. ఇది బాక్టీరియాను చంపడంలోనూ.. చెమట వాసనను తగ్గించడంలో సహాయపడుతుంది. కాబట్టి వేప ఆకులను గ్రైండ్ చేసి నీళ్లలో కలిపి ఈ నీటితో తలస్నానం చేయాలి. వేసవిలో.. మీరు ఈ నీటిని క్రమం తప్పకుండా ఉపయోగించవచ్చు.

మీ స్నానపు నీటిలో నిమ్మ, బేకింగ్ సోడా క‌ల‌పండి. ఆ నీటితో స్నానం చేయండి. ఇది మొదట శరీరంపై ఉన్న‌ బ్యాక్టీరియాను చంపుతుంది. దాని నుండి వెలువడే దుర్వాసనను విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది. చంకలు, పాదాలలో ఎలాంటి చర్మ సంక్రమణను తగ్గించడంలో సహాయపడుతుంది. కాబట్టి నీటిలో కొంచెం నిమ్మరసం, బేకింగ్ సోడా వేసి స్నానం చేయండి.

నీళ్లలో యూకలిప్టస్ ఆయిల్ వేసి.. ఈ నీటితో స్నానం చేయడం వల్ల చెమట దుర్వాసన తొలగిపోతుంది. దీనితో పాటు ఈ నూనె యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ కూడా.. ఇది ఎలాంటి చర్మ ఇన్ఫెక్షన్ల నుండైనా మిమ్మల్ని కాపాడుతుంది. కాబట్టి స్నానం చేసేటప్పుడు నీళ్లలో యూకలిప్టస్ ఆయిల్ వేసి ఆ నీటితో స్నానం చేయండి. ఇలా చేయడం వల్ల మీకు మేలు జరుగుతుంది.


Next Story