ఉబ్బరం, అసిడిటీ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.? ఈ 5 రకాల డ్రింక్స్ తాగండి

ప్రస్తుతం మారుతున్న జీవనశైలి వల్ల జీర్ణ సమస్యలు సర్వసాధారణం.

By Medi Samrat  Published on  1 Sep 2023 1:30 PM GMT
ఉబ్బరం, అసిడిటీ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.? ఈ 5 రకాల డ్రింక్స్ తాగండి

ప్రస్తుతం మారుతున్న జీవనశైలి వల్ల జీర్ణ సమస్యలు సర్వసాధారణం. ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం వల్ల చాలా సార్లు ఉబ్బరం వస్తుంది. దీని కారణంగా.. కడుపులో నొప్పి కూడా వ‌చ్చే ప్ర‌మాదం ఉంది. తరచుగా మ‌నం ఉదయం నిద్రలేచిన తర్వాత.. జీర్ణ సమస్యలను ఎదుర్కొంటాం. మీరు కూడా తరచుగా ఉబ్బరం సమస్యతో ఇబ్బంది పడితే.. మీరు ఉదయాన్నే ఈ ఎఫెక్టివ్ డ్రింక్స్ తాగండి. ఇవి మీకు, మీ కడుపుకు సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తాయి.

జీరా వాట‌ర్‌(జీల‌క‌ర్ర నీళ్లు)

జీలకర్ర నీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది మీ శరీరాన్ని డిటాక్సిఫై చేయడంలో సహాయపడుతుంది. అదనంగా.. ఇది మీ కడుపుని చల్లగా ఉంచే కార్మినేటివ్ ప్రభావాలను కలిగి ఉంటుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో జీలకర్ర నీటిని తాగడం వల్ల వాపు, అసిడిటీ మొదలైన వాటి నుంచి ఉపశమనం పొందవచ్చు.

పసుపు టీ

శతాబ్దాలుగా పసుపు వైద్యంలో భాగంగా ఉంది. ప‌సుపును ఉపయోగించడం ద్వారా మీరు జీర్ణ సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. దీని కోసం, పసుపు, అల్లం, నిమ్మ ర‌సం, కొంచెం తేనెను వేడి నీటిలో కలపి మ‌రిగించి తీసుకోండి. ఉబ్బరం సమస్యను తొలగించడంలో ఇది ప్రభావవంతంగా ఉంటుంది.

అల్లం, నిమ్మకాయ టీ

తరచుగా ప్రజలు తమ ఉదయం టీతో ప్రారంభిస్తారు. మిల్క్ టీకి బదులు అల్లం, లెమన్ టీ తాగితే ఎసిడిటీ, అజీర్ణం నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇది ప్రేగు సంబంధిత సమస్యల చికిత్సకు కూడా ప్రభావవంతంగా పరిగణించబడుతుంది.

దోసకాయ పుదీనా పానీయం

ఉబ్బరం నుండి ఉపశమనం పొందడానికి, మీరు దోసకాయ, పుదీనా, నిమ్మకాయ పానీయాన్ని సిద్ధం చేసుకోవ‌చ్చు. పుదీనా కడుపుని చల్లగా ఉంచుతుంది, దోసకాయ, నిమ్మకాయ శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఆరోగ్యానికి చాలా అవసరం.

రాతి ఉప్పు నీరు

రాతి ఉప్పును పింక్ సాల్ట్ అని కూడా అంటారు. మీరు రాతి ఉప్పుతో చేసిన పానీయంతో మీ రోజును ప్రారంభించండి. దీని కోసం మీరు అల్లం నీటిలో వేసి ఉడికించాలి. దానికి కొంచెం ఉప్పు, తేనె కలపండి. ఈ పానీయాన్ని గోరువెచ్చగా తీసుకోవాలి. దీని వ‌ల్ల కూడా క‌డుపులో స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు.

Next Story