నైట్ షిఫ్ట్ ప‌ని చేస్తున్నారా.. ఈ డైట్ ప్లాన్‌ను ఫాలో అవండి..!

Healthy Diet Tips for People Working Night Shifts. రాత్రి షిఫ్టులో పనిచేసే వారికి అనేక అనారోగ్య సమస్యలు ఉంటాయి.

By Medi Samrat  Published on  20 May 2023 7:00 PM IST
నైట్ షిఫ్ట్ ప‌ని చేస్తున్నారా.. ఈ డైట్ ప్లాన్‌ను ఫాలో అవండి..!

రాత్రి షిఫ్టులో పనిచేసే వారికి అనేక అనారోగ్య సమస్యలు ఉంటాయి. వారు అలసట, బలహీనత, జీర్ణక్రియకు సంబంధించిన అనేక సమస్యలను ఎదుర్కోంటూ ఉంటారు. భారీగా ఆహారం, టీ-కాఫీ, జంక్ ఫుడ్స్ తినడం మానుకోండి. నైట్ షిఫ్ట్ సమయంలో ఆరోగ్యానికి ఏయే ఆహారాలు అవసరమో తెలుసుకుందాం.

రాత్రి షిఫ్ట్‌లో ఉద్యోగులు ఆకలిని తీర్చుకోవడానికి బర్గర్లు, పిజ్జాలు, శీతల పానీయాలు, చిప్స్ వంటివి తింటారు. ఇవి ఆరోగ్యానికి చాలా హానికరం. మీరు రాత్రి షిఫ్టులో పనిచేస్తే.. మిల్లెట్లు తిని ఆఫీసుకు వెళ్లండి. ఇందులో ఉండే పోషకాలు జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహకరిస్తాయి. రాత్రిపూట భోజనం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించండి. అనారోగ్యకరమైన ఆహారాన్ని అధికంగా తినడం వల్ల నిద్ర వస్తుంది.

తరచుగా ఉద్యోగులు పని సమయంలో టీ, కాఫీ త్రాగడానికి ఇష్టపడతారు. కానీ ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. ఎనర్జిటిక్ గా ఉండేందుకు మజ్జిగ, తాజా పండ్ల రసం వంటివి తాగాలి. దీంతో తలనొప్పి, ఉబ్బరం, ఎసిడిటీ నుంచి ఉపశమనం పొందవచ్చు. ఫ్రూట్ సలాడ్ లేదా పనీర్ రోల్, వెజిటబుల్ శాండ్‌విచ్ వంటి ఆరోగ్యకరమైన స్నాక్స్ కూడా తినవచ్చు.

నైట్ షిఫ్ట్ తర్వాత డైట్‌లో ఏయే ఆహారాలు చేర్చుకోవాలి.?

నైట్ షిఫ్ట్ తర్వాత మీరు తప్పనిసరిగా మీ ఆహారంలో పండ్లను చేర్చుకోవాలి. అరటి లేదా మామిడి తినవచ్చు. అలాగే గుల్కంద్‌తో పాటు నీరు లేదా పాలు తాగవచ్చు. రోజంతా తాజాగా ఉండాలంటే సూర్య నమస్కారం 3 సార్లు చేయండి. తరచుగా ఉద్యోగులు రాత్రి షిఫ్ట్ పని చేసిన తర్వాత నిద్రపోతారు. దీంతో ఎసిడిటీ, తలనొప్పి, మలబద్ధకం వల్ల ఇబ్బంది పడవచ్చు. అందుకే నైట్ షిఫ్ట్ సమయంలో హెల్తీ డైట్ ఫాలో అవ్వండి. తేలికపాటి ఆహారాన్ని తినండి. ఆయిల్ ఫుడ్స్ తినకుండా ఉండండి.


Next Story