Health Tips: ఈ ఆరు సూత్రాలతో మంచి ఆరోగ్యం మీ సొంతం
ఆరోగ్యంగా ఉండాలంటే ఈ సూత్రాలను తప్పక పాటించాలి. అప్పుడే మంచి ఆరోగ్యం మీ సొంతమవుతుంది. ఇందులో కష్టసాధ్యమైనవీ...
By - అంజి |
Health Tips: ఈ ఆరు సూత్రాలతో మంచి ఆరోగ్యం మీ సొంతం
ఆరోగ్యంగా ఉండాలంటే ఈ సూత్రాలను తప్పక పాటించాలి. అప్పుడే మంచి ఆరోగ్యం మీ సొంతమవుతుంది. ఇందులో కష్టసాధ్యమైనవీ అంటూ ఏవీ లేవు. మీకు ఈ సూత్రాలను పాటించాలన్న పట్టుదల ఉంటే సరిపోతుంది.
ప్రతి రోజూ కనీసం అరగంట పాటు వ్యాయామం చేయాలి. వారంలో కనీసం 150 నిమిషాలు వ్యాయామం కోసం కేటాయించాలి. పరుగు, సైక్లింగ్, ఈత, యోగా, నృత్యం ఇలా.. రోజూ ఏదో ఒక వ్యాయామం తప్పనిసరి.
ఉదయం బ్రేక్‌ఫాస్ట్ నిర్లక్ష్యం చేయకూడదు. కడుపునిండా అల్పాహారం తీసుకోవాలి. మధ్యాహ్న భోజనం సరిపడినంత తినాలి. రాత్రి డిన్నర్ కాస్త మితంగా తీసుకోవాలి.
నీటిని నిర్లక్ష్యం చేయకూడదు. రోజూ కనీసం 2 నుంచి లీటర్ల నీరు తాగాలి. ఇది శరీరంలోని మలినాలను బయటకు పంపడంతో పాటు జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచుతుంది.
ఆఫీసులో కంప్యూటర్, ల్యాప్‌టాప్ స్క్రీన్‌ను అదే పనిగా ఎక్కువసేపు చూడొద్దు. దీనివల్ల కంటి చూపుపై ప్రభావం పడటంతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అరగంటకు ఒకసారైనా కంటికి కాస్త విరామం ఇవ్వండి.
రాత్రి భోజనం తర్వాత నిద్రపోవడానికి మధ్య రెండు గంటల సమయం ఉండేలా చూసుకోండి.
రోజూ కనీసం 7 నుంచి 9 గంటల నిద్ర ఉండాలి. దీనివల్ల వ్యాధి నిరోధక శక్తి పెరగడంతో పాటు ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగి మానసికంగా ఆరోగ్యం బాగుంటుంది.