గుడ్లు ఎక్కువగా తింటున్నారా.. దుష్ప్రభావాలు తెలుసుకోండి.!
గుడ్లు ఆరోగ్యానికి అవసరమైన అనేక పోషకాలను కలిగి ఉంటాయి.
By Medi Samrat Published on 27 Aug 2023 5:58 PM ISTగుడ్లు ఆరోగ్యానికి అవసరమైన అనేక పోషకాలను కలిగి ఉంటాయి. తరచుగా ప్రజలు గుడ్లను అల్పాహారంగా తింటారు. గుడ్లు ఉపయోగించి అనేక రకాల వంటకాలు తయారు చేస్తారు. ప్రొటీన్లు, విటమిన్లు, ఐరన్ మొదలైన అన్ని పోషకాలు గుడ్లలో లభిస్తాయి. గుడ్లు రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యాన్ని ఎంతగానో ఉపయోగపడుతాయి. తెలియని విషయమేమిటంటే.. గుడ్లు ఎక్కువగా తినడం వల్ల కూడా అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. గుడ్లు తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏమిటో తెలుసుకుందాం.
కొలెస్ట్రాల్ సమస్య
మీకు కొలెస్ట్రాల్ సమస్యలు ఉంటే.. గుడ్లు తినే ముందు వైద్యుడిని సంప్రదించండి. గుడ్లు ఎక్కువగా తింటే శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగి గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.
జీర్ణవ్యవస్థకు హానికరం
అధికంగా గుడ్లు తింటే జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది. తద్వారా కడుపు నొప్పితో ఇబ్బంది పడే అవకాశం కూడా ఉటుంది. కొందరికి గుడ్లు తింటే ఎలర్జీ కూడా ఉంటుంది.
బరువు పెరిగే అవకాశం
ఆహారంలో గుడ్లు ఎక్కువ పరిమాణంలో తీసుకుంటే బరువు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా కోడిగుడ్డు పచ్చసొనను ఎక్కువగా తింటే బరువు పెరుగుతారు. పచ్చసొనలో కొవ్వు పదార్ధాలు ఉంటాయి.
గుడ్లు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
గుడ్లలో జింక్, విటమిన్ B6, B12 ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి. తద్వారా మీరు ఫ్లూ, జలుబును నివారించవచ్చు.
గుడ్డులో ఉండే విటమిన్ డి.. మీ ఎముకలను బలంగా ఉంచుతుంది.
గుడ్డు పచ్చసొన లేదా ఉడకబెట్టిన గుడ్లలోని పసుపు భాగంలో లుటిన్, జియాక్సంతిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కళ్లను కాపాడతాయి.
గుడ్లు చర్మానికి కూడా మేలు చేస్తాయి.