Ginger Tea Benefits : అల్లం టీ తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు..!
అల్లం అనేది మన వంటగదిలో ఎక్కువగా వాడుతుంటాము. దీనిని ఆహార రుచిని పెంచడానికి అనేక వంటలలో ఉపయోగిస్తారు.
By Medi Samrat
అల్లం అనేది మన వంటగదిలో ఎక్కువగా వాడుతుంటాము. దీనిని ఆహార రుచిని పెంచడానికి అనేక వంటలలో ఉపయోగిస్తారు. ఇది రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. అవును.. అటువంటి అనేక పోషకాలు అల్లంలో ఉన్నాయి, అల్లంలో ఉండే పోషకాలు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. అల్లం అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. ఈ నేపధ్యంలోనే మనం అల్లం టీ గురించి మీకు చెప్పబోతున్నాం, ఇది తయారు చేయడం చాలా సులభం. దీని ప్రయోజనాలు చాలా ఉన్నాయి. అవి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అల్లం టీ వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
జీర్ణశక్తి మెరుగుకు..
అల్లం టీ జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. మలబద్ధకం సమస్య నుండి ఉపశమనం అందించడంతో పాటు.. ఉబ్బరం, గ్యాస్, అసిడిటీ, కడుపు నొప్పి వంటి సమస్యలను దూరం చేయడంలో కూడా ఇది ప్రభావవంతంగా పనిచేస్తుంది. కాబట్టి, దీన్ని తాగడం వల్ల జీర్ణక్రియకు మేలు జరుగుతుంది.
కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో..
గుండె ఆరోగ్యంగా ఉండాలంటే కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. అల్లం టీ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది, ఇది గుండెపోటు, స్ట్రోక్ వంటి వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది.
రక్తపోటు అదుపులో..
రక్తపోటు పెరగడం వల్ల ఆరోగ్యానికి చాలా హాని కలుగుతుంది. అటువంటి పరిస్థితిలో అల్లం టీ కాల్షియం ఛానెల్‌ని నిరోధించడం ద్వారా రక్తపోటును నియంత్రించడంలో చాలా సహాయపడుతుంది. అంతే కాదు రక్తనాళాలు ఆరోగ్యంగా ఉండేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది.
రోగనిరోధక శక్తి బలపడటానికి..
అల్లం యాంటీమైక్రోబయల్ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. అల్లం టీ తాగడం వలన రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. ఇది ఇన్ఫెక్షన్లతో పోరాడడంలో సహాయపడుతుంది. అందువల్ల జలుబు, దగ్గు, ఫ్లూ మొదలైన వాటిని నివారించడంలో ఇది చాలా సహాయపడుతుంది.
చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో..
యాంటీ మైక్రోబియల్ లక్షణాలతో పాటు, యాంటీఆక్సిడెంట్లు కూడా అల్లంలో ఉన్నాయి, ఇవి చర్మానికి చాలా మేలు చేస్తాయి. అల్లం టీ చర్మాన్ని, ఫ్రీ రాడికల్స్ దెబ్బతినకుండా కాపాడుతుంది. అకాల వృద్ధాప్యాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా.. ఇది మొటిమలను నివారించడంలో కూడా సహాయపడుతుంది.
వికారం నుండి ఉపశమనం..
వికారం లేదా వాంతులు వంటి సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే.. అల్లం టీ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. జింజెరాల్ ఇందులో ఉంటుంది, ఇది వికారం నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది.
నొప్పి నివారణలో..
యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అల్లంలో ఉన్నాయి. అల్లం టీ తాగడం వల్ల నొప్పి, వాపు తగ్గుముఖం పడతాయి. ఇది మాత్రమే కాదు. ఇది ఎముకల నొప్పి నుండి ఉపశమనాన్ని అందించడమే కాకుండా పీరియడ్స్ క్రాంప్ నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది.