ప్రతి ముగ్గురిలో ఒకరు హైపర్ టెన్షన్ బాధితులే..
Glenmark Pharmaceuticals concludes Hypertension Awareness Month in India. అంతర్జాతీయ ఫార్మాస్యూటికల్ కంపెనీ గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్
By Medi Samrat Published on 31 May 2022 5:57 PM ISTఅంతర్జాతీయ ఫార్మాస్యూటికల్ కంపెనీ గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ (గ్లెన్‌మార్క్) మే నెలను హైపర్‌టెన్షన్ అవగాహన మాసంగా గుర్తించింది. గ్లెన్‌మార్క్ దేశవ్యాప్తంగా 50 నగరాల్లో 8000 కంటే ఎక్కువ ఆసుపత్రులు, క్లినిక్‌ల ద్వారా 18,000 మంది ఆరోగ్య సంరక్షణ నిపుణులతో (HCPs) భాగస్వామ్యం కలిగి ఉంది. అధిక రక్తపోటు గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి 110 కంటే ఎక్కువ ప్రజా అవగాహన ర్యాలీలు, 8000 స్క్రీనింగ్ శిబిరాలను నిర్వహించింది.
ఈ ర్యాలీలలో భాగంగా హైపర్‌టెన్షన్ లక్షణాలు, నివారణ పద్ధతులు పట్ల అవగాహన కల్పించడంతో పాటుగా సామాన్య ప్రజలకు క్యాంప్‌లను సైతం నిర్వహించారు. ఈ మొత్తం కార్యక్రమాలకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. ఈ కార్యక్రమాల ద్వారా దాదాపు 2 లక్షల మంది ప్రజలలో అవగాహన కల్పించింది.
ఈ కార్యక్రమం గురించి గ్లెన్‌మార్క్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ అండ్ హెడ్ ఆఫ్ ఇండియా ఫార్ములేషన్స్ అలోక్‌మాలిక్ మాట్లాడుతూ ''ఈ నెల రోజుల కార్యక్రమాలలో దేశంలో హైపర్‌టెన్షన్ పట్ల అవగాహన కల్పించే ప్రయత్నం చేశాం. హైపర్‌టెన్షన్ వ్యాధి ఎలాంటి లక్షణాలూ కనిపించవు. ఇటీవల భారతదేశంలో నిర్వహించిన అధ్యయనంలో ప్రతి ముగ్గురు భారతీయులలో ఒకరు హైపర్ టెన్షన్ తో బాధపడుతున్నారు.
హైపర్‌టెన్షన్ మహమ్మారితో పోరాడేందుకు అనువుగా విభిన్న చర్యలను తీసుకోనున్నామని ఆయన అన్నారు. హైపర్‌టెన్షన్ విభాగంలో అగ్రగామిగా , విప్లవాత్మక యాంటీ హైపర్‌టెన్షన్ డ్రగ్స్, టెల్మాను విడుదల చేసింది. ఇటీవలనే గ్లెన్‌మార్క్ సంస్థ టేక్ చార్జ్ ఎట్ 18 ప్రచారం ప్రారంభించింది. దీనిద్వారా 18 సంవత్సరాలు దాటిన వ్యక్తులకు హైపర్‌టెన్షన్ పట్ల అవగాహన కల్పిస్తోంది.