కాఫీ అతిగా తాగుతున్నారా.. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి

Drinking six or more cups of coffee per day may up CVD risk. ఏదైనా కానీ అతిగా ఉండకూడదు.. మితి మీరింది అంటే ప్రమాదమే..!

By Medi Samrat  Published on  20 Feb 2021 11:44 AM GMT
కాఫీ అతిగా తాగుతున్నారా.. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి
ఏదైనా కానీ అతిగా ఉండకూడదు.. మితి మీరింది అంటే ప్రమాదమే..! అది కాఫీ విషయంలో కూడా వర్తిస్తుంది అంటున్నారు. పొద్దున్నే లేవగానే ఒక కాఫీ.. టిఫిన్ చేసిన తర్వాత ఒక కాఫీ.. లంచ్ మధ్యలో ఒక కాఫీ.. ఇలా అవకాశం దొరికితే చాలు కాఫీ తాగేస్తూ ఉంటారు. కొందరికి అదొక అడిక్షన్ లాగా కూడా మారిపోయి ఉంటుంది. కానీ ఇదేమీ సిగరెట్, మద్యం లాంటిది కాదు కదా అని అనుకునే వారే ఎక్కువ..! కానీ అతిగా కాఫీ తాగడం కూడా చాలా ప్రమాదం అని అంటున్నారు.


కాఫీ అధికంగా తాగడం వల్ల హృద్రోగాలు వస్తాయని.. ప్ర‌తిరోజు ఐదు కప్పుల‌కు మించి కాఫీ తాగేవారు హృద్రోగాల నుంచి త‌ప్పించుకోలేర‌ని పరిశోధకులు చెప్పారు. యూనివర్సిటీ ఆఫ్‌ సౌత్‌ ఆస్ట్రేలియా ప‌రిశోధ‌కులు ఇందుకు సంబంధించిన వివ‌రాలను తాజాగా వెల్ల‌డించారు. ప్రతిరోజూ ఐదు కప్పులకు మించి కాఫీ తాగుతున్న వారిలో.. కాఫీలో ఉండే కఫెస్టోల్‌ అనే రసాయన మూలకం కార‌ణంగా కొవ్వు పేరుకుపోతోంద‌ని.. దీంతో వారిలో రక్త ప్రసరణ సరిగ్గా‌ జరగకపోవ‌డంతో హృద్రోగాలు వ‌స్తున్నాయ‌ని అన్నారు. ఫిల్టర్‌ చేయని కాఫీలో ఈ కఫెస్టోల్ అధికంగా ఉంటుందని.. కాఫీ ప్రియులు ఫిల్టర్‌ కాఫీకి ప్రాధాన్య‌త ‌ఇస్తే బాగుంటుంద‌ని చెప్పారు. త‌మ అధ్య‌య‌నాన్ని ఇంకా కొన‌సాగిస్తున్న‌ట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు రోజుకు 300 కోట్ల కప్పుల కాఫీని తాగుతున్నారు. కాబట్టి కాఫీ తాగే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే..!


Next Story