ఫిట్‌నెస్ కోసం అతిగా జిమ్ చేస్తే గుండె పోటు వస్తుందా.?
Does doing more gym for fitness cause heart attack.?. కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్ ఆకస్మిక మరణం.. అందరినీ విషాదంలో ముంచేసింది. ఆయన శుక్రవారం ఉదయం ఇంట్లో ఉన్న
By అంజి Published on 29 Oct 2021 4:38 PM ISTకన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్ ఆకస్మిక మరణం.. అందరినీ విషాదంలో ముంచేసింది. ఆయన శుక్రవారం ఉదయం ఇంట్లో ఉన్న జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా అస్వస్థతకు గురయ్యాడు. గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కింద కుప్పకూలిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రి తరలించే ప్రయత్నం చేశారు.. కానీ పునీత్ మార్గమధ్యలోనే కన్నుమూశాడు. పునీత్ వయస్సు 46 ఏళ్ల మాత్రమే. అయితే అతడు ఆకస్మికంగా మృతిచెందడం సినీ పరిశ్రమతో పాటు, అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఫిట్‌గా ఉండేందుకు పునీత్ రోజు వ్యాయామం చేస్తూ ఉండేవాడు. ఆరోగ్యం ఎక్కువగా శ్రద్ధ పెట్టే పునీత్‌కు గుండెపోటు రావడం తీవ్ర ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆయనకు గుండెపోటు రావడానికి ప్రధాన కారణం అధికంగా జిమ్ చేయడమేనని వార్తలు వస్తున్నాయి.
మరీ జిమ్ ఎలా చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
వెంటిలేషన్ సరిగ్గా ఉన్న జిమ్‌లలో మాత్రమే వ్యాయామం చేయాలి. చిన్న చిన్న రూమ్‌లో ఉండే జిమ్ సెంటర్‌లలో వ్యాయామం చేయొద్దు. ఎందుకంటే వెయిట్ లిఫ్టింగ్, రన్నింగ్, జాగింగ్ చేసినప్పుడు మనం వదిలిన గాలినే తిరిగి తీసుకోవాల్సి వస్తుంది. దీంతో బ్లడ్‌లో కార్బన్ డై ఆక్సైడ్ శాతం పెరుగుతుంది. దీంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. బలహీనంగా ఉన్న వారికి ఊపిరితిత్తులు సరిగా పని చేయవు. దీంతో ఒత్తిడి పెరిగి కార్డియా అటాక్‌తో చనిపోయే ఛాన్స్ ఉంటుంది. చాలా మంది బరువు తగ్గడం కోసం, బరువు పెరగడం కోసం జిమ్ సెంటర్‌లకు వెళ్తూ ఉంటారు. మరికొందరు ఫిట్‌నెస్ కోసం జిమ్‌కు వెళ్తుంటారు. మెడిసన్స్ వాడుతున్న వారైతే ముఖ్యం డాక్టర్ల సూచనల మేరకే జిమ్ చేయాలి.
ఇక జిమ్ సెంటర్‌లో తప్పనిసరిగా మెడికల్ అడ్వైజర్‌ను ఏర్పాటు చేసుకోవాలి. మన సామర్థ్యం మేరకు వ్యాయామం చేయాలని.. ఎక్కువ బరువున్న పరికరాలను అస్సలు ఎత్తొద్దు. ఇక వ్యాయామం చేస్తున్నప్పుడు ఎట్టిపరిస్థితుల్లోనూ మాస్క్‌లు ధరించకూడదు. జిమ్‌కు వెళ్లేటప్పుడు వాటర్, లెమన్ వాటర్, కొకోనట్ వాటర్, ఓఆర్‌ఎస్‌ను తెచ్చుకోవాలి. జిమ్‌లో ఉండే పరికరాల గురించి, వాటి ఎలా ఉపయోగిస్తారో తెల్సుకోవాలి. నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే విభిన్నమైన కసరత్తులు చేయాలి. వర్కౌట్‌కు ముందు డ్రై ఫ్రూట్స్ తింటే ఇంకా మంచిది.