అధిక బరువు ఉన్నవారికి డయబెటిస్ వస్తుందా ?

Do overweight people get diabetes. ప్రపంచంలో అధికంగా బాధపడుతున్నది డయాబెటిస్‌తో. ఈ వ్యాధిగ్రస్థులు దేశంలో

By Medi Samrat  Published on  20 Feb 2021 11:23 AM IST
అధిక బరువు ఉన్నవారికి డయబెటిస్ వస్తుందా ?

ప్రపంచంలో అధికంగా బాధపడుతున్నది డయాబెటిస్‌తో. ఈ వ్యాధిగ్రస్థులు దేశంలో రోజురోజుకు పెరిపోతున్నారు. వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు వెంటాడుతూనే ఉంది. అయితే డయాబెటిస్‌లో రెండు రకాలు ఉంటాయి. టైమ్‌-2 డయాబెటిస్‌ రావడానికి అనేక కారణాలుంటాయి. ఇందులో రక్తంలో చక్కెర స్థాయిలో నియంత్రణ అవసరం. డయాబెటిస్‌ అదుపులో పెట్టుకోవడానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే సాధారణంగా అధిక బరువు ఉన్నవారిలో ఈ డయబెటీస్ చాలా ప్రమాదకరమని వైద్య నిపుణులు చెబుతున్నారు.. వంశపారపర్యంగా వచ్చే అవకాశాలు ఎక్కువ. అంటే కుటుంబంలో పెద్దవారికి ఉండడం వలన కూడా ఇది క్రమంగా వచ్చే అవకాశం అధికంగా ఉంటుందని ఇప్పటికే వైద్య నిపుణులు తేల్చారు. దీనిపై పరిశోధకులు ఏమంటున్నారో తెలుసుకుందాం.

డయాబెటిస్‎కు, శరీర బరువు మధ్య సంబంధం..

సాధారణంగా అధిక బరువు ఉన్నవారు లేదా డయాబెటిస్‌ యొక్క కుటుంబ చరిత్ర ఉన్నవారు మాత్రమే ఎక్కువగా డయాబెటి బాధపడతారు. మీరు అధిక బరువుతో ఉంటేటి వారికి ఎక్కువ ప్రమాదం ఉండే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అయితే డయాబెటిస్‌ ఉన్నవారు ప్రతి రోజు మందులు వాడుతూ ఆహార నియమాలు సరిగ్గా పాటించడం ఎంతో ముఖ్యం. అలాగే తక్కువ బరువు లేదా సహజ బరువు ఉన్నవారికి కూడా డయాబెటిస్ రావచ్చు అని పరిశోధకులు వెల్లడిస్తున్నారు.

డయాబెటిస్‌ను నియంత్రించాలంటే ..

డయాబెటిస్‌ ఉన్న వారు ఏడాదిలో రెండు సార్లు అయిన పరీక్షలు చేయించుకోవాలి. కుటుంబ పరంగా డయాబెటిస్‌ వస్తూ ఉంటూ ఆ కుటుంబంలోని 20 సంవత్సరాలు దాటిన వారు కచ్చితంగా డయాబెటిస్ చెక్ చేసుకోవాలి. అలాగే కుటుంబ పరంగా డయాబెటిస్ లేనివారు 30 ఏళ్ళు దాటిన తర్వాత చెక్ చేసుకోవాలి. లక్షణాలు కనిపించే వరకు ఆగడం సరైనది కాదు. అలాంటి వారికి ప్రమాదం లేకపోలేదు అని చెప్పలేం. ఈ సమస్య భారతీయులకు అధికంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ప్రారంభంలోనే ఈ వ్యాధిని గుర్తిస్తే.. దానిని నియంత్రించేందుకు మార్గం ఉంటుందని తెలిపారు. ఒకవేళ మొదట్లో చెక్ చేసుకోకపోతే.. అది క్రమంగా పెరిగి తీవ్రతరమవుతుందని తెలిపారు. అలాగే డయాబెటిస్‌ ఉన్న వారు ప్రతి రోజు వాకింగ్‌ చేయడం తప్పనిసరి. అంతేకాకుండా ఆహార నియమాలు తప్పకుండా పాటించాలి. తీపి పదార్థాలకు, ఆల్కహాలు, మాంసం వంటివి తీసుకోకపోవడం మంచిది. ప్రతి రోజు వాకింగ్‌ చేయడం వల్ల డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవచ్చు. అలాగే కాకరకాయ, ఆకు కూరలు ఎక్కువగా తీసుకోవాలి. ఇక జామ, బొప్పాయి వంటి ఫైబర్‌ ఎక్కువగా ఉండే పండ్లు తీసుకోవడం వల్ల కూడా షుగర్‌ వ్యాధిని కంట్రోల్‌ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.




Next Story