డయాబెటిస్ (మధుమేహం)తో బాధపడేవారు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. మిగిలిన వారిలా అన్ని రకాల ఆహార పదార్థాలను తినే అవకాశం ఉండదు. కొన్ని రకాల ఆహార పదార్థాలను తినడం వల్ల డయాబెటిస్ రోగుల రక్తంలో కొన్నిసార్లు చక్కెర స్థాయిలు ఒకేసారి పెరిగే ప్రమాదం ఉంటుంది.
కొందరు డయాబెటిస్ రోగులు తీపి తినాలి అనిపించినప్పుడు చక్కెరకు బదులుగా బెల్లం లేదా బెల్లంతో చేసిన ఏదైనా స్వీట్ తింటుంటారు. అయితే ఇది కూడా ప్రమాదమేనట. ఇలా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయ. బెల్లం, తేనె వంటివి తినకుండా ఉండడమే మంచిది.
పండ్లలో సహజ చక్కెర ఉంటుంది. భోజనం చేశాక కొందరు పండ్లు తింటుంటారు. అయితే భోజనం చేశాక కొంత షుగర్ శరీరంలో చేరుతుంది. ఆ తర్వాత పండ్లు తింటే.. భోజనం, పండ్లలో ఉండే చక్కెర కలిసి రక్తంలో చక్కెర స్థాయిలు విపరీతంగా పెరిగిపోతాయి. అంతేకాకుండా భోజనం తర్వాత పండ్లు తింటే గ్యాస్, అజీర్ణం సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అందుకే ఇలా చేయకపోవడం మంచిది.
ఆయుర్వేదం ప్రకారం పెరుగు శరీరంలో వేడి చేస్తుంది. కఫ దోషం పెంచుతుందంటారు. అందుకే డయాబెటిస్ రోగులు పెరుగుకు బదులు మజ్జిగ తాగడం మంచిది.