క్యాన్సర్, క్యాన్సరేతర పరిస్ధితులలో గర్భధారణ శక్తి, సంరక్షణపై డాక్టర్లు ఏమంటున్నారంటే..
CME on Fertility Preservation by Esha IVF with Scientific Session. హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఉన్న ఈషా ఐవీఎఫ్ ఫెర్టిలిటీ సెంటర్,
By Medi Samrat Published on 22 July 2022 5:15 PM ISTహైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఉన్న ఈషా ఐవీఎఫ్ ఫెర్టిలిటీ సెంటర్, షీల్డ్ ఫార్మాస్యూటికల్స్‌తో కలిసి సీఎంఈ (కంటిన్యూయేషన్ మెడికల్ ఎడ్యుకేషన్)ను క్యాన్సర్, క్యాన్సరేతర పరిస్ధితులలో గర్భధారణ శక్తి సంరక్షణపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. ఈ సదస్సు హైదరాబాద్ పార్క్ హయత్‌లో శుక్రవారం నిర్వహించారు. ఈ నిర్ధిష్టమైన సీఎంఈ తో పాటుగా ఈషా ఐవీఎఫ్ ఫెర్టిలిటీ సెంటర్ వద్ద ఆంకో ఫెర్టిలిటీ క్లీనిక్‌ను సైతం ప్రారంభించారు. ఇక్కడ క్యాన్సర్ రోగులకు పూర్తి ఉచితంగా కన్సల్టేషన్ సేవలను అందించడంతో పాటుగా క్యాన్సర్, దాని చికిత్స గర్భధారణ శక్తిపై చూపే ప్రభావం గురించి వెల్లడించనున్నారు.
డాక్టర్ చందన లక్కిరెడ్డి(సీనియర్ ఐవీఎప్ స్పెషలిస్ట్, ఈషా ఐవీఎఫ్ ఫెర్టిలిటీ) మాట్లాడుతూ.. '' శాస్త్రీయ సదస్సును నిర్వహించడంతో పాటుగా ఈషా ఐవీఎఫ్ ఫెర్టిలిటీ వద్ద ఆంకో ఫెర్టిలిటీ క్లీనిక్‌ను ప్రారంభించడం పట్ల సంతోషంగా ఉన్నాము. క్యాన్సర్ (ఆంకాలజీ), ఆంకాలజీయేతర (నాన్ ఆంకాలజీ) పరిస్థితులలో సంతానోత్పత్తి పరిరక్షణ పట్ల అవగాహన మెరుగుపరిచేందుకు ఈ కార్యక్రమం చేశాము. ఈ అవగాహన సదస్సు లో రోగులతో పాటుగా సామాన్య ప్రజలను సైతం భాగంగా చేయడంతో పాటుగా ఈ రంగాలలో నిపుణులను సైతం ఒకే దరికి తీసుకువచ్చాము. నేడు ఈ సదస్సులో పాల్గొన్న గౌరవనీయ డాక్టర్లందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. సంతానోత్పత్తి పరిరక్షణ దిశగా వారు తమ అనుభవాలతో అవగాహన మెరుగుపరిచేందుకు తమ మద్దతునందించారు ''అని అన్నారు.
వాస్తవానికి కేవలం 5% శాతం మాత్రమే 20–39 సంవత్సరాల లోపు వయసు వ్యక్తులలో క్యాన్సర్ గుర్తించబడుతున్నప్పటికీ, పలు రకాల క్యాన్సర్‌లలో జీవించేందుకు అవకాశాలు 80%కు పైగానే ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఈ వయసు గ్రూప్ వ్యక్తులలో క్యాన్సర్ పై విజయం సాధించేందుకు అవకాశాలున్నాయి. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం యుక్త వయసులో ఉన్న అంటే 35 సంవత్సరాల లోపు వయసు కలిగి, చికిత్స సమయానికి పిల్లలు లేని ప్రతి నలుగురు క్యాన్సర్ రోగులలో ముగ్గురు పిల్లలు కనాలనుకుంటున్నారు. క్యాన్సర్ చికిత్స కారణంగా అండాలు మరియు వీర్యకణాలపై తీవ్ర ప్రభావం పడవచ్చు. అంతేకాకుండా మహిళలల్లో అండాశయంపై ప్రభావం పడితే, మగవారిలో వృషణాలపై కూడా ప్రభావం పడవచ్చు. ఈ ఫలితంగా క్యాన్సర్ తో పోరాడి విజయం సాధించిన వ్యక్తులలో జీవిత నాణ్యతకు వంధ్యత్వం ఒక అవరోధంగా నిలుస్తుంది.
ఈ సమాచారం అనుసరించి, 40%కు పైగా ఆంకాలజిస్ట్‌లు ఇప్పటికీ క్యాన్సర్ చికిత్స వల్ల సంతానోత్పత్తిపై పడే ప్రభావం గురించి చర్చించడం లేదు. అదే సమయంలో దాదాపు 45% మంది ఆంకాలజిస్ట్‌లు రోగులను రీప్రొడక్టివ్ నిపుణుల వద్దకూ పంపడం లేదు.
సంతానోత్పత్తి పరిరక్షణపై విద్యాసదస్సుకు హాజరైన డాక్టర్లలో అధికశాతం మంది సంతానోత్పత్తి పట్ల రోగుల కోరికను కూడా పరిగణలోకి తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. రోగులు చికిత్సకు సిద్ధమైనప్పుడు ఈ అంశాలను గురించి చర్చించాల్సి ఉందని 44% అభిప్రాయపడితే, ఈ సదస్సులకు హాజరుకాని వారు 33% మాత్రమే ఈ దిశగా ఆలోచిస్తున్నారు. ఎండోమెట్రియోసిస్, ఆటొ ఇమ్యూన్ డిజార్డర్లు చేత సంతానోత్పత్తిపై ప్రభావం పడిన వారితో పాటుగా ఇతర ఆరోగ్య సమస్యలు కలిగిన 8–13% మంది రోగులలో గర్భధారణ శక్తిని కాపాడాల్సిన అవసరం ఉంది.
డాక్టర్ సచిన్ మర్దా (సర్జికల్ ఆంకాలజిస్ట్) మాట్లాడుతూ.. '' క్యాన్సర్ చికిత్సతో పాటుగా దానితో సంబంధం కలిగిన వంధ్యత్వ సమస్యలు యుక్త వయసు క్యాన్సర్ సర్వైవర్లలో అతి సాధారణంగా కనిపిస్తుంటుంది. కానీ మేమెప్పుడూ కూడా క్యాన్సర్ చికిత్సపై దృష్టి సారించడంతో పాటుగా సంతానోత్పత్తి అంశాలను నిర్లక్ష్యం చేస్తుంటాము. డాక్టర్ చందన మరియు ఆమె బృందం ఈ అతి ముఖ్యమైన అంశం అయిన ఆంకో ఫెర్టిలిటీతో ముందుకు రావడం సంతోషంగా ఉంది. ఇది మొట్టమొదటి మరియు వినూత్నమైన సీఎంఈ. రోగులు, గైనకాలజిస్ట్ మరియు ఆంకాలజిస్ట్‌లు ఈ సదస్సు ద్వారా అసాధారణంగా ప్రయోజనం పొందగలరు. ఫెర్టిలిటీ టీమ్‌కు అభినందనలు'' అని అన్నారు.
డాక్టర్ సాయి లక్ష్మి దాయన (గైనకాలజిల్ ఆంకాలజిస్ట్) మాట్లాడుతూ.. ''ప్రతి మహిళకు ఓ బుజ్జాయి కావాల్సి ఉంది. అదే రీతిలో క్యాన్సర్ సర్వైవర్స్‌కు కూడా! నిపుణుల సలహా, సూచనలు వారికి సరైన సమయంలో అందాల్సి ఉంది. యుక్త వయసులో ఉండి క్యాన్సర్ బారిన పడిన మహిళలు సైతం ఇప్పుడు సురక్షితంగా గర్భం దాల్చడంతో పాటుగా ఆరోగ్యవంతమైన శిశువును సాధారణ మహిళల్లాగానే పొందవచ్చు. తల్లి, శిశువుపై ఎలాంటి ప్రభావమూ ఉండదని సైన్స్ నిరూపించింది'' అని అన్నారు.
డాక్టర్ సతీష్‌అడిగ (ప్రొఫెసర్ అండ్ హెచ్‌ఓడీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎంబ్రియాలజీ) మాట్లాడుతూ.. ''సాంకేతికతలో అత్యాధునిక ఆవిష్కరణలు అయిన అండాలు, వీర్యంతో విట్రో మెచ్యురేషన్, ఒవేరియన్ టిష్యూ క్రియో ప్రిజర్వేషన్ టెక్నిక్స్ ద్వారా క్యాన్సర్ చికిత్స తరువాత గరిష్ట ప్రయోజనం పొందగలము. అయితే, దీని గురించి మరింత పరిశోధన జరగాల్సి ఉంది. తద్వారా భవిష్యత్‌లో మరింత ప్రయోజనం పొందగలం'' అని అన్నారు.