అలాంటి‌ మౌత్‌వాష్‌తో కరోనా ఖతం.. అది ఏంటంటే?

Chlorhexidine mouthwash kills 99.9% of Covid-19 virus. కరోనా మహమ్మారి ఈ ప్రపంచం పై విరుచుకుపడి దాదాపు సంవత్సరం

By Medi Samrat  Published on  18 Dec 2020 9:10 AM GMT
అలాంటి‌ మౌత్‌వాష్‌తో కరోనా ఖతం.. అది ఏంటంటే?

కరోనా మహమ్మారి ఈ ప్రపంచం పై విరుచుకుపడి దాదాపు సంవత్సరం కావస్తున్నా ఇప్పటికి ఎటువంటి వాక్సిన్ అందుబాటులోకి రాలేదు. వైరస్ కు వాక్సిన్ కనుగొనడానికి ఇప్పటికే పలు ఫార్మా కంపెనీలు క్లినికల్ ట్రయల్స్ కూడా నిర్వహించాయి. తొందరలోనే ఈ వైరస్ కి వాక్సిన్ అందుబాటులోకి వస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. అంతేకాకుండా కరోనా వైరస్ ను కట్టడి చేయడానికి అన్ని రాష్ట్రం ప్రభుత్వాలు పటిష్టమైన చర్యలను చేపడుతూ వస్తుంది. ఇందులో భాగంగానే కరోనా వైరస్ ను అదుపు చేయడానికి క్లోర్‌హెక్సిడైన్‌ మౌత్‌వాష్‌ ఎంతో సమర్థవంతంగా పనిచేస్తుందని తాజా అధ్యయనాల్లో వెల్లడైంది.

పంజాబ్‌ యూనివర్సిటీకి చెందిన డాక్టర్‌ హెచ్‌ఎస్‌జే ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డెంటల్‌ సైన్సెస్‌, సీఎస్‌ఐఆర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మైక్రోబయల్‌ టెక్నాలజీ నిర్వహించిన అధ్యయనంలో క్లోర్‌హెక్సిడైన్‌ మౌత్‌వాష్‌ ఎంతో సమర్థవంతంగా పని చేస్తూ కరోనా వైరస్ ను నోట్లోనే అంతం చేస్తుందని పేర్కొన్నారు.ఈ పరిశోధనలు నిర్వహించడానికి ప్రముఖ ఫార్మా కంపెనీ అయిన డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ సహకారం అందించడంతో ఈ పరిశోధనలను నిర్వహించారు.ఈ పరిశోధనలో భాగంగా నే క్లోర్‌హెక్సిడైన్‌ మౌత్‌వాష్‌ కరోనాను కట్టడి చేస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి నోటిద్వారా లేదా గొంతు ద్వారా వ్యాపించి శరీరంలోకి ప్రవేశిస్తుంది. కాబట్టి ఈ వైరస్ శరీరంలోకి వ్యాపించకుండా నోట్లోనే అంతం చేయడానికి మనం సాధారణంగా ఉపయోగించే క్లోర్‌హెక్సిడైన్‌ మౌత్‌వాష్‌తో ప్రతి రోజు మన నోటిని 30 సెకండ్ల పాటు పుక్కలించడం వల్ల కరోనా వైరస్ మన గొంతులోనే 99% నశించిపోతుందని హెచ్‌ఎస్‌జే ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డెంటల్‌ సైన్సెస్‌కు చెందిన డాక్టర్‌ ఆశిష్‌ జైన్‌ తెలిపారు. అయితే ఈ పరిశోధన పై మరింత లోతుగా అధ్యయనం చేసి క్లోర్‌హెక్సిడైన్‌ మౌత్‌వాష్‌ను క్లినికల్ ట్రయల్స్ నిర్వహించవలసి ఉంటుందని ఈ సందర్భంగా నిపుణులు తెలియజేశారు.


Next Story