అతిగా తినడం వల్లే కాదు.. వాటి కొరత వల్ల కూడా ఊబకాయం వస్తుంది
శరీరం సక్రమంగా ఎదుగుదలకు పోషకాలు అవసరమని మనమందరం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం.
By Medi Samrat Published on 27 April 2024 9:15 AM IST
శరీరం సక్రమంగా ఎదుగుదలకు పోషకాలు అవసరమని మనమందరం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. అందుకే వైద్యుల నుండి పెద్దల వరకు అందరూ ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారం తీసుకోవాలని సలహా ఇస్తారు. శరీరం సరిగ్గా పనిచేయడానికి చాలా పోషకాలు అవసరం. ఏదైనా పోషకాల లోపం ఉంటే, ఆరోగ్య సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. అంతే కాదు.. శరీరంలో పోషకాల కొరత కూడా మీ స్థూలకాయానికి కారణమవుతుంది.
అతిగా తినడం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఊబకాయం బారిన పడతారని వింటూఉంటాం. అయితే, వీటన్నింటితో పాటు శరీరంలో కొన్ని పోషకాలు లేకపోవడం వల్ల కూడా మీరు ఊబకాయం బారిన పడే అవకాశం ఉంది. ఈరోజు ఈ ఆర్టికల్‌లో మనం అలాంటి కొన్ని పోషకాల గురించి చెప్పబోతున్నాం.. కాబట్టి బరువు పెరగడానికి కారణమయ్యే పోషకాల గురించి తెలుసుకుందాం..
విటమిన్ డి
విటమిన్ డి మన ఆరోగ్యానికి చాలా ముఖ్యమైన పోషకం. దీని లోపం జీవక్రియ, ఇన్సులిన్ సెన్సిటివిటీని దెబ్బతీస్తుంది, దీని వల్ల కొవ్వు కరగడం మందగిస్తుంది. బరువు పెరుగుటకు కారణమవుతుంది.
ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్
ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు మన శరీరం సాధారణంగా పనిచేయడానికి సహాయపడుతుంది. దీని లోపం ఆకలి, హార్మోన్లలో ఆటంకాలకు దారి తీస్తుంది. ఇది క్యాలరీలు అధికంగా ఉండే ఆహార పదార్ధాల కోసం కోరికలను పెంచుతుంది. అతిగా తినడం వలన బరువు పెరుగుటకు కారణమవుతుంది.
ప్రోటీన్
శరీరం సరైన అభివృద్ధికి ప్రోటీన్ చాలా ముఖ్యమైనది. ఇది ఎముకలు, కండరాలను బలంగా నిర్మించడంలో, మరమ్మత్తు చేయడంలో మాత్రమే కాకుండా..శక్తికి కూడా మూలం. దీని లోపం ఎక్కువ తినాలనే కోరికను పెంచుతుంది, ఇది బరువు పెరగడానికి దోహదం చేస్తుంది.
విటమిన్ బి
B12, B6 వంటి విటమిన్ B కూడా మన శరీర అభివృద్ధికి చాలా ముఖ్యమైనవి. శరీరంలో దీని లోపం అలసటను కలిగిస్తుంది. బరువు పెరగడానికి కూడా దోహదం చేస్తుంది.
అయోడిన్
అయోడిన్ కూడా చాలా ముఖ్యమైన పోషకం, దీని లోపం శరీరంలో హైపోథైరాయిడిజమ్‌కు కారణమవుతుంది. ఇది జీవక్రియను నెమ్మదిస్తుంది. బరువు పెరగడానికి దారితీస్తుంది.
ఇనుము
ఐరన్ లోపం వల్ల రక్తహీనత మాత్రమే కాకుండా, తరచుగా అలసట, జీవక్రియకు అంతరాయం కలిగిస్తుంది. అలాగే బరువు పెరగడానికి దారితీస్తుంది.