'జామ' అధిక రక్తపోటును నియంత్రిస్తుందా..?

Can guava fruit intake decrease blood pressure. జామ ఆరోగ్యానికి ఎంతో మంచిది. సామాన్యుడికి సైతం చౌకగా లభించే పండ్లలో ఒకటైనది

By Medi Samrat  Published on  13 Feb 2021 3:52 AM GMT
జామ అధిక రక్తపోటును నియంత్రిస్తుందా..?

జామ ఆరోగ్యానికి ఎంతో మంచిది. సామాన్యుడికి సైతం చౌకగా లభించే పండ్లలో ఒకటైనది జామ అనే చెప్పాలి. పెద్దగా ధర ఉండదు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే చాలా ఇళ్లల్లో జామ చెట్లు ఉంటాయి. జామపండులో అధిక రక్తపోటును తగ్గించే గుణం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. బీపీ రక్తం ధమనుల గోడలపై అధిక ఒత్తిడి కలిగిస్తుంది. ఇది రానురాను కొన్ని తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. అధిక రక్తపోటు కారణంగా ముందు.. స్టోక్‌, గుండెకు సంబంధించిత వ్యాధులు, కొరోనరీ ఆర్టీరీ వ్యాధి, దీర్ఘకాలిక మూత్ర పిండాల వ్యాధి లాంటి ప్రమాదాలు వచ్చే అవకాశాలున్నాయి. రక్తపోటు ప్రమాదం అయినప్పటికీ దీనిని అరికట్టేందుకు కొన్ని ఖచ్చితమైన చర్యలు అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. అధిక రక్తపోటు లాంటి దీర్ఘకాలిక వ్యాధులన్నింటిని అరికట్టేందుకు ఉత్తమ మార్గం ఏదైనా ఉందా..? అంటే మీ ఆహారంలో కొన్ని మార్పులు చేయడమే.

అలా అధిక రక్తపోటును నివారించేందుకు మీ ప్రతి రోజు డైట్‌లో జామపళ్లను చేర్చడం మంచి ఫలితాన్ని ఇస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జామలో పోటాషియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో మంచి ఔషధంగా పని చేస్తుంది. వాస్తవానికి శరీరంలో పోటాషియం లోపం అనేది రక్తపోటుతో పాటు గుండెకు సంబంధిత వ్యాధులు, గుండెపోటు వచ్చే అవకాశాలను పెంచుతుంది.

జామలో రక్తపోటు తగ్గించే గుణం ఉందా..?

అయితే నిజానికి జామ పండ్లను తినడం వల్ల రక్తపోటును తగ్గించుకోలేరు. ఇవి తినడం వల్ల మీ శరీరానికి విటమిన్‌-సి అనేది అధికంగా లభిస్తుంది. నారింజ పండులో కూడా విటమిన్‌-సి ఉంటుంది. అయితే నారింజలో కంటే జామలో విటమిన్‌-సి నాలుగు రేట్లు ఉంటుందట. ఈ విటమిన్‌ వల్ల రక్త నాళాలపొరను బలోపేతం చేయడానికి ఎంతో సహాయపడుతంది. ఇక ఈ పొరలు అధిక స్థాయి రక్తపోటును ఎదుర్కొనేందుకు ఎంతగానో దోహదపడతాయి. మరో విషయం ఏమిటంటే.. ఎప్పుడో ఒకసారి జామపండును తినడం వల్ల అధిక రక్తపోటును నియంత్రించేలేరు. ప్రతి రోజు క్రమం తప్పకుండా తీసుకుంటే వల్ల రక్తపోటుకు పని చేస్తుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కనీసం రెండు రోజులకు ఒకసారైనా జామపండు తినడం, లేదా రసం తాగడం వల్ల ఎంతో మేలు ఉంటుందంటున్నారు.

డయాబెటిస్‌ ఉన్నవారికి ..

అలాగే జామ రక్తపోటుకే కాకుండా డయాబెటిస్‌ ఉన్నవారికి మంచి ఔషధంగా పని చేస్తుంది. క్రమం తప్పకుండా తీసుకుంటే షుగర్‌ వ్యాధిని అదుపులో ఉంచుతుంది. డయాబెటిసే కాకుండా ఇందులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి.


Next Story