జిమ్‌కి వెళ్లే ముందు ఈ నేచురల్ ప్రీ-వర్కౌట్ డ్రింక్స్ తాగండి.. మీ శరీరం చురుకుగా ఉంటుంది..!

బాడీ ఫిట్‌నెస్‌ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. చాలా మంది ఫిట్‌గా ఉండేందుకు యోగా వంటివి చేస్తుండ‌గా..

By Medi Samrat  Published on  23 May 2024 2:15 AM GMT
జిమ్‌కి వెళ్లే ముందు ఈ నేచురల్ ప్రీ-వర్కౌట్ డ్రింక్స్ తాగండి.. మీ శరీరం చురుకుగా ఉంటుంది..!

బాడీ ఫిట్‌నెస్‌ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. చాలా మంది ఫిట్‌గా ఉండేందుకు యోగా వంటివి చేస్తుండ‌గా.. కొంత‌మంది ఆహారాన్ని నియంత్ర‌ణ‌లో ఉంచుకుంటున్నారు. మ‌రికొంత‌మంది ఫిట్ గా ఉండేందుకు జిమ్ కు వెళ్తుంటారు. కానీ ఖాళీ కడుపుతో జిమ్‌కు వెళ్లి బలహీనంగా అవుతున్న‌ట్లు భావించే వారు చాలా మంది ఉన్నారు. ఇది మీ రక్తపోటు(బీపీ)ను తగ్గిస్తుంది. త‌ద్వారా అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌తాం.

జిమ్‌లో వర్కవుట్ చేసే వారు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఇది వర్క్ అవుట్ సమయంలో మీ శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. వ్యాయామానికి ముందు ఒక పండు లేదా తేలికపాటి ఆరోగ్యకరమైన అల్పాహారం తినాలని జిమ్ శిక్షకులు కూడా సూచిస్తున్నారు. ఈ రోజు మనం అలాంటి కొన్ని సహజమైన ప్రీ-వర్కౌట్ డ్రింక్స్ గురించి తెలుసుకుందాం. వీటిని జిమ్ సెషన్‌కు ముందు తీసుకోవాలి.

ప్రీ-వర్కౌట్ డ్రింక్స్

గ్రీన్ టీ

గ్రీన్ టీ చాలా ఆరోగ్యకరమైన, తక్కువ కేలరీలు ఉన్న‌ పానీయంగా మ‌న‌కు తెలుసు. చాలా మంది బరువు తగ్గడానికి కూడా దీన్ని తాగుతుంటారు. ఇది వర్కౌట్‌కు ముందు మంచి పానీయం. గ్రీన్ టీ.. కెఫిన్, యాంటీఆక్సిడెంట్ల యొక్క మంచి మూలం. ఇది శక్తిని, దృష్టిని పెంచడంలో సహాయపడుతుంది.

కాఫీ

ఏకాగ్రతను పెంచడానికి కాఫీ తాగడం ఎల్లప్పుడూ చాలా మంచిదని భావిస్తారు. జిమ్‌కి వెళ్లే ముందు ఒక కప్పు బ్లాక్ కాఫీ తాగడం వల్ల అలసట తగ్గుతుంది. మన మెదడు వేగంగా పని చేయడం ప్రారంభిస్తుంది. ఇదంతా కాఫీలో ఉండే కెఫిన్ వల్లనే జరుగుతుంది.

కొబ్బరి నీరు

తాజా కొబ్బరి నీరు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది ఎలక్ట్రోలైట్స్ యొక్క సహజ మూలం. దీన్ని తాగడం వల్ల శరీరంలో హైడ్రేషన్, ఎనర్జీ మెయింటెయిన్ అవుతుంది. వర్కవుట్ చేయడం కూడా సులభం అవుతుంది.

అల్లం, నిమ్మకాయ నీరు

వ్యాయామానికి ముందు ఒక గ్లాసులో అల్లం,నిమ్మరసం కలిపి తాగడం చాలా మంచిదని భావిస్తారు. ఈ పానీయం కొవ్వును కరిగిస్తుంది. దీన్ని తాగడం వల్ల శరీరంలో శక్తి పెరిగి రిఫ్రెష్‌గా అనిపిస్తుంది.

బీట్ రూట్ జ్యూస్

తాజా బీట్ రూట్ రసంలో నిమ్మరసం కలిపి తాగడం వల్ల మీ శరీరానికి వ్యాయామం చేసే శక్తి లభిస్తుంది. ఇందులో ఉండే నైట్రేట్స్ రక్త ప్రసరణను కూడా పెంచుతాయి.

Next Story