మొలకెత్తిన శనగలు, పెసలు తినడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. ఆరోగ్యకరంగా ఉంచే ఎంజైములు, మాంసకృతులు సమృద్దిగా ఉన్నాయి. మొలకలలో ఎ,బి,సి, బి1,బి6, కె విటమిన్లు, ఐరన్‌, పాస్పరస్‌, మెగ్నీషియం, పోటాషియం, మాంగనీసు, కాల్షియం సమృద్ధిగా ఉన్నాయి. మొలకలలో పీచు, ఫోలేట్‌ , ఒమెగా 3 కొవ్వు ఆమ్లాలు అధిక సంఖ్యలో ఉంటాయి. మొలకెత్తిన గింజలు, ధాన్యాలు, కాయ ధాన్యాలలో ఈ పోషకాలు పుష్కలంగా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. మొలకెత్తిన తర్వాత చాలా వరకు విటమిన్‌ ఎ ఎనిమిది రేట్లు పెరుగుతుంది. నిజానికి వీటిలో 35 శాతం వరకు మాంసకృతులు ఉంటాయి. జంతువుల మాంసాల వల్ల వచ్చే కొవ్వును, క్యాలరీలను తగ్గిస్తుంది. మొలకెత్తిన విత్తనాలు తినడం వల్ల జీర్ణసంబంధ, కడుపు ఉబ్బరం సస్యలున్నవారికి ఎంతో మేలు జరుగుతుంది. మొలకెత్తిన గింజలు గుండె జబ్బుల నుంచి కాపాడుతాయి.

మొలకల్లో యాంటీ ఆక్సిడెంట్స్‌ అధిక మోతాదులో లభిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్స్‌ జట్టు, చర్మం, నెయిల్స్‌ పెరగడానికి ఎంతగానో సహాయపడతాయి. మొలకలు తినడం వల్ల శరీరానికి అవసరమయ్యే పోషకాలు అందుతాయి. ముఖ్యంగా ప్రాణాంతక వ్యాధి అయిన క్యాన్సర్‌ వంటి నివారణలో సహాయపడతాయి. మొలకలు శరీరానికి న్యూట్రీషియన్‌ వంటిది. ఇది మన శరీరంలోని రక్తంతో పాటు ఆక్సిజన్‌ను శరీరంలోని అన్ని భాగాలకు ప్రసరించేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి. మానవ శరీరంలోజీవక్రియలను సరిగ్గా పని చేసేందుకు ఉపయోగపడతాయి. అంతేకాదు మొలకలు జట్టు పెరుగుదలకు ఉపయోగపడతాయి. వీటిలో సి విటమిన్‌ అధికంగా ఉండటం వల్ల జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి. వీటిలో విటమిన్‌ సి అధికంగా ఉండటం వల్ల జుట్టు పొడవుగా, అందంగా పెరగడానికి ఉపయోగపడతాయి. మొలకెత్తిన విత్తనాల్లో విటమిన్స్‌ ఎ,బి కాంప్లెక్స్‌, సి, ఇ అధికంగా ఉంటాయి.

మొలకల్లో ఫైబర్‌ శాతం అధికంగా ఉంటుంది. ఇది బరువు తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. ఇది శరీరంలో మెటబలిజం రేటు పెంచుతుంది. శరీరంలో టాక్సిన్స్‌ను తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచడానికి . . విటమిన్ ' C ' మొలకెత్తిన గింజల్లో ఎక్కువగా ఉండడం వల్ల తెల్ల రక్త కణాలు (WBCs) శక్తివంతంగా పనిచేయడంలో తోడ్పడుతుంది. తద్వారా రోగనిరోధక శక్తిని పెంచగలుగుతుంది.


సామ్రాట్

Next Story