పిల్లలకు ప్లాస్టిక్‌ బాటిల్స్‌లో పాలు పడుతున్నారా?

ప్లాస్టిక్‌ వినియోగం రోజు రోజుకూ పెరుగుతోంది. తక్కువ ధరకే రావడం, ఎక్కువ కాలం పాటు మన్నిక, సులువుగా లభ్యం కావడం వల్ల చాలా మంది ప్లాస్టిక్‌ వస్తువులను వాడేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

By అంజి
Published on : 18 Feb 2025 1:30 PM IST

children, milk, plastic bottles, Health Tips

పిల్లలకు ప్లాస్టిక్‌ బాటిల్స్‌లో పాలు పడుతున్నారా?

ప్లాస్టిక్‌ వినియోగం రోజు రోజుకూ పెరుగుతోంది. తక్కువ ధరకే రావడం, ఎక్కువ కాలం పాటు మన్నిక, సులువుగా లభ్యం కావడం వల్ల చాలా మంది ప్లాస్టిక్‌ వస్తువులను వాడేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. చాలా మంది చిన్నారులకు పాలు ఇచ్చేందుకు ప్లాస్టిక్‌ బాటిల్స్‌ను ఉపయోగిస్తుంటారు. అయితే పిల్లలకు పాలు ఇవ్వడానికి ప్లాస్టిక్‌ బాటిల్స్‌ వాడటం ఏమాత్రం మంచిదికాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్లాస్టిక్‌ బాటిల్స్‌లో వేడి వేడి పాలు పాలు వేయడం వల్ల.. ఆ వేడికి హానికర ప్లాస్టిక్‌ కణాలు నెమ్మదిగా కరిగి పాలలో చేరి చిన్నారుల కడుపులోకి ప్రవేశించే ప్రమాదం ఉంది. ఈ ప్రక్రియ దీర్ఘకాలం కొనసాగడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలతో పాటు వారి మెదడుపై కూడా తీవ్ర ప్రభావం పడుతుందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ప్లాస్టిక్‌ డబ్బాలు, బాటిళ్లలో వేడి పానీయాలు, పదార్థాలు వేసి ఉంచడం వల్ల ప్లాస్టిక్‌లోని రసాయనాలు విడుదలై అవి ఆ పదార్థాల్లోకి చేరి అవి ఆరోగ్యానికి హానికరంగా మారుతున్నాయి. అందుకే అవకాశం ఉంటే పిల్లలకు పాలు ఇవ్వడానికి గ్లాస్‌ లేదా స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ బాటిల్స్‌ ఉపయోగించడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

(గమనిక: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం.. ఇక్కడ తెలియజేస్తున్నాం.)

Next Story