ఈ సీజన్‌లో వింటర్ ఫ్లూ, న్యుమోనియాను దూరంగా ఉంచడానికి 5 ముఖ్యమైన చిట్కాలు.!
శీతాకాలం కొనసాగుతున్న కొద్దీ, దగ్గు, జలుబు, ఫ్లూ, న్యుమోనియా వంటి కాలానుగుణ ఇన్ఫెక్షన్లు తీవ్ర స్థాయి లో ఉంటాయి.
By - న్యూస్‌మీటర్ తెలుగు |
శీతాకాలం కొనసాగుతున్న కొద్దీ, దగ్గు, జలుబు, ఫ్లూ, న్యుమోనియా వంటి కాలానుగుణ ఇన్ఫెక్షన్లు తీవ్ర స్థాయి లో ఉంటాయి. చల్లని వాతావరణం వైరస్‌లు వ్యాప్తి చెందడాన్ని సులభతరం చేస్తుంది, అంటే ఎక్కువ మంది అనారోగ్యానికి గురవుతారు. మరి శుభవార్త ఏమిటి? మిమ్మల్ని, మీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి సాధారణ చర్యలు తీసుకోవడం ద్వారా మీరు నిశ్చింతగా ఉండవచ్చు - తరచుగా చేతులు కడుక్కోవడం, బాగా తినడం, వెచ్చగా ఉండటం వంటివి.
మనకు వచ్చింది ఫ్లూ జ్వరమా లేదా అంతకంటే తీవ్రమైనదా అని గుర్తించడం కష్టం. ఎందుకంటే అనేక లక్షణాలు ఒకదానికొకటి అతివ్యాప్తి చెందుతాయి. జ్వరం, దగ్గు, అలసట, గొంతు నొప్పి, శరీర నొప్పులు, శ్వాస ఆడక పోవడం కూడా ఫ్లూ లేదా న్యుమోనియా వంటి శ్వాసకోశ ఇన్ఫెక్షన్‌లను సూచిస్తాయి. ఈ లక్షణాలు కొనసాగితే లేదా తీవ్రమైతే, వైద్యుడిని సంప్రదించడం మంచిది.
డాక్టర్ అరుణ్ వాధ్వా, ఎంబీబీఎస్, ఎండీ - పీడియాట్రిక్స్, డాక్టర్ అరుణ్ వాధ్వా క్లినిక్, దిల్లీ, ఈ సీజన్‌లో కచ్చిత మైన రోగ నిర్ధారణ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ‘‘శీతాకాలపు అనారోగ్యాలు పెరుగుతున్నందున, సరైన రోగ నిర్ధారణ అనేది కోలుకోవడానికి, సమస్యలను నివారించడానికి ఎంతో కీలకం. మీరు అనారోగ్యంగా ఉన్నట్లు భావిస్తే, దానిని విస్మరించవద్దు – సురక్షితంగా, ఆరోగ్యంగా ఉండటానికి ముందుగానే వైద్యుడిని సంప్రదించండి’’ అని ఆయన సూచించారు.
సకాలంలో పరీక్షలు చేయవలసిన అవసరం
మన వేగవంతమైన జీవితాల్లో, ఎవరూ కూడా అనారోగ్యంతో ఓ పక్కన బాధపడుతూ ఉండాలని అనుకోరు. సరిగ్గా ఈ విషయంలోనే, వేగవంతమైన పరీక్ష అమలులోకి వస్తుంది. ఇది ఫ్లూ, న్యుమోనియా వంటి శ్వాసకోశ వ్యాధులను నిర్ధారించడానికి త్వరిత, సమర్థవంతమైన మార్గాన్ని అందిస్తుంది.
అబాట్ అంటు వ్యాధుల వైద్య వ్యవహారాల డైరెక్టర్ డాక్టర్ సోను భట్నాగర్ సకాలంలో పరీక్ష చేయించుకోవాల్సిన ప్రాముఖ్యతను చాటిచెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘‘శ్వాసకోశ ఇన్ఫెక్షన్‌లను సమర్థవంతంగా నిర్వహించడంలో పరీక్ష కీలక పాత్ర పోషిస్తుంది. వివిధ శ్వాసకోశ వ్యాధులకు వేగవంతమైన పరీక్ష ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. ఇది త్వరిత, కచ్చితమైన రోగ నిర్ధారణకు వీలు కల్పిస్తుంది’’ అని అన్నారు.
ఈ సీజన్‌లో మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి మీరు పాటించాల్సిన కొన్ని సులభమైన పద్ధతులు ఇక్కడ ఉన్నాయి:
1. పరీక్ష చేయించుకోండి: మీకు ఏది అనారోగ్యం కలిగిస్తుందో తెలుసుకోవడం అనేది కోలుకోవడంలో మొ దటి అడుగు. మీకు శ్వాసకోశ ఇన్ఫెక్షన్ లక్షణాలు ఉంటే, మీ వైద్యుడితో మాట్లాడి, త్వరితగతిన పరీక్ష చేయించుకోవడం గురించి ఆలోచించండి. వేగవంతమైన పరీక్షలు త్వరగా ఫలితాలను అందిస్తాయి, సరై న చికిత్సను ఎంచుకోడానికి మీ వైద్యుడికి సహాయపడతాయి, తద్వారా మీరు త్వరగా కోలుకోవచ్చు.
2. మీ పరిస్థితిని పర్యవేక్షించండి: మీ లక్షణాలను, వాటి తీవ్రతను గమనిస్తూ ఉండండి. మీకు జ్వరం పెరుగుతున్నా లేదా ఏవైనా లక్షణాలు తీవ్రమవుతున్నా, వెంటనే మీ వైద్యుడిని సంప్రదించండి.
3. చికిత్స తీసుకోండి: సత్వర రోగ నిర్ధారణతో, మీరు వెంటనే చికిత్స పొందవచ్చు. లక్షణాల నుండి ఉపశ మనం పొందడానికి, ఇన్ఫెక్షన్‌తో పోరాడటానికి మీ వైద్యుడు సూచించిన మందులు, మార్గదర్శకాల పూర్తి కోర్సును సరిగ్గా పాటించాలని గుర్తుంచుకోండి.
4. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి: తగినంత విశ్రాంతి తీసుకోండి. బాగా నిద్రించండి. ప్రశాంతంగా ఉండండి, బాగా హైడ్రేటెడ్‌గా ఉండండి (నీరు, రసం, కొబ్బరి నీరు లేదా తాజా పండ్ల రసం వంటివి తీసు కోండి), ఆరోగ్యదాయక ఆహారాన్ని తినండి.
5. ఇంట్లోనే ఉండండి: మీరు అనారోగ్య లక్షణాలను ఎదుర్కొంటుంటే, మీరు కోలుకోవడానికి సమయం పట్ట వచ్చు. అప్పటి వరకు ఒంటరిగా ఉండాలి. ఇన్ఫెక్షన్ ఇతర వ్యక్తులకు వ్యాపించకుండా చూసుకోవాలి.
శీతాకాలం కొనసాగుతున్నందున, ముందు జాగ్రత్తగా ఉండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. మీరు అనారోగ్యంగా ఉన్నట్లయితే, చేతులు కడుక్కోవడం, రద్దీగా ఉండే ప్రదేశాలలో మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి సాధారణ ముందుజాగ్రత్త అలవాట్లను కొనసాగించండి. రక్షణ పొందడానికి ఉత్తమ మార్గాలలో ఒకటి ఫ్లూ, న్యుమోనియాకు సంబంధించిన టీకాలు వేయించుకోవడం. ఈ చర్యలు తీసుకోవడం ద్వారా, మీరు ఈ కాలాన్ని సురక్షితంగా ఆస్వాదించవచ్చు. మీకు ప్రియమైన వారిని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఈ శీతాకాలంలో మీరు వెచ్చదనంతో, ఆరోగ్యంతో ఉండాలని ఆశిస్తున్నాం!