బిర్యానీ ఆకుతో ఈ వ్యాధులకు చెక్‌...!

By సుభాష్  Published on  21 Dec 2019 11:05 PM IST
బిర్యానీ ఆకుతో ఈ వ్యాధులకు చెక్‌...!

దేశంలో రోగాల బారినపడేవారు అధికం అవుతున్నారు.మనం తినే ఆహారంలో గాని, పీల్చే గాలిలో గాని, ఇతర కారణాల వల్ల వ్యాధిలు అధికంగా వ్యాపిస్తున్నాయి. పని ఒత్తిడి, టెన్షన్‌ పడటం, నిద్రలేమి తదితర కారణాలతోనే మానవుడు వివిధ రకాల వ్యాధులు కొనితెచ్చుకుంటున్నాడు. అనారోగ్యం బారిన పడకుండా మన ఇంట్లో బిర్యానీ ఆకుతో నయం చేసుకోవచ్చంటున్నారు వైద్య నిపుణులు.

సాధారణంగా బిర్యానీ ఆకును ఇంట్లో వంటకాల్లో మాత్రమే వాడుతుంటారు. బిర్యానీ వాసన కోసం వాడే ఈ ఆకుల్లో ఎన్నో ఆరోగ్య గుణాలున్నాయని చెబుతున్నారు వైద్యులు. శ్వాస కోస వ్యవస్థ సంబంధిత వ్యాధుల బారిన పడేవారు వంటకాల్లో బిర్యానీ ఆకును తరుచూ తీసుకుంటే నయం చేసుకోవచ్చు. ఇన్‌ప్లమేషన్‌కు కారణమయ్యే ఇంటర్‌ల్యూకిన్‌ అనే ప్రోటీన్లను వాధి నిరోధక వ్యవస్థను అతి తక్కువ పరిణామాల్లో విడుదల చేస్తుంటుంది. ఇందుకోసం బిర్యానీ ఆకు తరుచూ తీసుకుంటే ఈ ప్రోటీన్‌ విడుదల తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా షుగర్‌ వ్యాధి ఉన్నవారికి బిర్యానీ ఆకు ఎంతో ఉపయోపడుతుందని అంటున్నారు వైద్య నిపుణులు. బిర్యానీ ఆకులను కాషాయంలా తయారు చేసుకుని తాగితే మంచి ఫలితం ఉంటుందట.

షుగర్‌ వ్యాధి ఉన్నవారు ..

ఒక పాత్రలో పది బిర్యానీ ఆకులను తీసుకుని, అందులో మూడు గ్లాసులు నీళ్లు పోసుకుని సుమారు పది నిమిషాల పాటు మరిగించాలి. తర్వాత స్టవ్‌ పై నుంచి దించేసి పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత అందులో ఉన్న ఆకులను తీసేసి గ్లాసు చొప్పున రోజుకు మూడుసార్లు అలాగే ఉదయం బ్రేక్‌ పాస్ట్‌, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనానికి గంట ముందు కాషాయం తాగితే మంచి ఫలితాలుంటాయట. ఇలా వరుసగా మూడు రోజుల పాటు క్రమం తప్పకుండా చేయాలి. అలాగే రెండు వారాల తర్వాత మళ్లీ మూడు రోజులు ఇలా కషాయం తాగితే షుగర్‌ వ్యాధి అదుపులోకి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల ఇన్సులిన్‌ ఉత్పత్తిని క్రమబద్దికరించి షుగర్‌ వ్యాధి అదుపులోకి వస్తుంది. అంతేకాకుండా కొలెస్ట్రాల్‌ తగ్గడం వల్ల గుండె వ్యాధులు రాకుండా అడ్డుకుంటుంది. క్యాన్సర్‌ వ్యాధి రాకుండా అడ్డుకట్టవేసేందుకు ఎంతో ఉపయోగపడుతుందని చెబుతున్నారు.

Next Story