దగ్గు, వెన్నునొప్పితో బాధపడుతున్నారా..? అయితే ఇలా చేసి చూడండి
By సుభాష్ Published on 2 Jan 2020 8:45 PM ISTఇప్పుడున్న జనరేషన్‌లో ఆరోగ్య సమస్యలు అధికంగా తలెత్తుతున్నాయి. మనం పీల్చేగాలి వల్లగాని, వాతావరణ కాలుష్యం, సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల అనేక సమస్యలు వెంటాడుతున్నాయి. పని ఒత్తిడి, టెన్షన్‌కు గురికావడం వల్ల కూడా అనారోగ్యం బారిన పడుతున్నారు. అలా కాకుండా కొన్ని కొన్ని ఆరోగ్య సమస్యలకు ఇంట్లో ఉన్న వస్తువులతోనే చెక్ పెట్టవచ్చని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
ఇక కొందరు దగ్గు, ఛాతి నొప్పితో బాధపడుతుంటారు. అలాంటి వారు కొన్నింటిని పాటిస్తే దగ్గు, ఛాతినొప్పి బారి నుంచి తప్పించుకోవచ్చని నిపుణులు చెబుతున్న మాట. ఇలాంటి వారు ప్రతి రోజు ఉదయం మూడు కప్పుల నీళ్లలో రెండు తమలపాకులు,నాలుగు మిరియాలు వేసి సగం అయ్యే వరకు మరిగించి, అందులో ఒక టీస్పూను తేనె కలుపుకొని తాగితే మంచి ఫలితం ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇక తులసి ఆకులను తేనెలో కలిపి పరగడుపున తీసుకోవడం వల్ల దగ్గుకు ఔషధంగా పని చేస్తుంది. ఇక దానిమ్మ తొక్కలను పొడి చేసి ఉదయం పూట ఒక గ్లాసు నీటిలోఒక టీస్పూను పొడిని కలుపుకొని రక్త శుద్ధి జరుగుతుందంటున్నారు.
వెన్ను నొప్పితో బాధపడేవారు..
ఇక వెన్ను నొప్పితో బాధపడేవారు నువ్వుల నూనె లేదా.. ఆముదంలో వెల్లుల్లి రెబ్బలు వేసి ఐదు నిమిషాల పాటు చిన్న మంటపై మరిగించి, ఈ నూనెతోవెన్నకు మర్దనా చేస్తే ఎంతో ఫలితం ఉంటుంది. వెన్ను నొప్పి ఉన్న చోట అల్లం పేస్టుతో మర్దనా చేసినా నొప్పి తగ్గుతుందంటున్నారు. అలాగే ఏదైనా గాయాలు అయి రక్తం కారుతుంటే చందనం పొడిలో కొద్దిగా నీటిని కలిపి పేస్టులా చేసుకుని గాయానికి రాస్తుంటే త్వరగా తగ్గిపోతుందని, ఇలాంటి ఇంటి చిట్కాలు పాటించడం వల్ల ఎంతో ఉపయోగపడుతుందని ఆయుర్వేద నిపుణులు పేర్కొంటున్నారు.