తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం సృష్టించిన హయత్ నగర్ మర్డర్ కేస్ లో సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. సొంత త‌ల్లినే క‌డ‌తేర్చిన కూతురు కీర్తి వ్య‌వ‌హారం ముందు నుండి అనుమాన‌స్ప‌దమే అని పోలీసుల విచార‌ణ‌లో తేట‌తెల్ల‌మ‌వుతుంది. అయితే.. కీర్తి మైనర్ గా ఉన్నప్పుడు ఆమెకు మహబూబ్ నగర్ జిల్లా ఆమనగల్ లోని పద్మ నర్సింగ్ హోమ్ లో శశి, బాల్ రెడ్డి లు అబార్షన్ చేయించిన సంగ‌తి తెలిసిందే. హత్య కేసులో ఈ విషయం వెలుగులోకి రావడంతో కీర్తి రెడ్డికి అబార్షన్ చేసిన హాస్పిటల్ పై రంగారెడ్డి డిఎంహెచ్ఓ స్వరాజ్యలక్ష్మి, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు నేడు దాడులు చేశారు. మైన‌ర్ బాలిక‌కు అబార్ష‌న్ ఎలా చేస్తారంటూ హాస్పిటల్ ను సీజ్ చేశారు.

సామ్రాట్ మేడి

మేడి. సామ్రాట్ .. నేను న్యూస్ మీట‌ర్ లో జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేస్తున్నాను. గ‌తంలో ఆంధ్ర‌ప్ర‌భ‌, భార‌త్ టుడే, న్యూస్ హ‌బ్, ఏపీ హెరాల్డ్ ల‌లో 3 సంవ‌త్స‌రాల పాటు ప‌నిచేశాను. జ‌ర్న‌లిజం ప‌ట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.