డిజిటల్‌ కేబుల్‌ టీవీ దిగ్గజం రాజశేఖర్‌ మృతి

By సుభాష్  Published on  29 Aug 2020 3:32 PM IST
డిజిటల్‌ కేబుల్‌ టీవీ దిగ్గజం రాజశేఖర్‌ మృతి

హాత్‌వే డిజిటల్‌ కేబుల్‌ మాజీ డైరెక్టర్‌, వెంకటసాయి మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ అధినేత చెలికాని రాజశేఖర్‌ గుండెపోటుతో మరణించారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలు చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కేబుల్‌ టీవీ, బ్రాడ్‌ బ్యాండ్‌ ఇంటర్నెట్‌ సర్వీసు రంగంలో రాజశేఖర్‌ ఎంతో కాలంగా సేవలందించారు. అంతేకాకుండా ఏపీ ఎంఎస్‌వోల సంఘం అధ్యక్షుడిగా పని చేశారు. ఆల్‌ ఇండియా బాల్‌ బ్యాడ్మింటన్‌ ఫెడరేషన్‌లో రాజశేఖర్‌ కీలక బాధ్యతలు నిర్వహించారు.

రాజశేఖర్ మృతిపై పలువురి సంతాపం

రాజశేఖర్‌ గుండెపోటుతో మృతి చెందడంతో బ్రైట్‌వే కమ్యూనికేషన్‌ సంస్థ సంతాపం తెలిపింది. తెలంగాణ ఎంఎస్‌వోల అసోసియేషన్‌, కేబుల్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశాయి. అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర్‌ మంచి పేరు సంపాదించుకున్నారని, కేబుల్‌ ఆపరేటర్ల సంక్షేమం కోసం ఆయన ఎనలేని కృషి చేశారన్నారు. రాజశేఖర్‌ మృతి పట్ల ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Next Story