టిక్‌టాక్‌ను మించిన హైదరాబాదీ 'హైస్టార్‌ యాప్‌'

By సుభాష్  Published on  27 Aug 2020 6:50 AM GMT
టిక్‌టాక్‌ను మించిన హైదరాబాదీ హైస్టార్‌ యాప్‌

దేశ భద్రత ప్రమాణాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం చైనాకు చెందిన 59 యాప్‌లను నిషేధించిన విషయం తెలిసిందే. అందులో ముఖ్యంగా టిక్‌టాక్‌ యాప్‌. టిక్‌టాక్‌ నిషేధం తర్వాత పలు భారతీయ కంపెనీలు సరికొత్త ఆవిష్కరణలతో యువతను ఆకర్షించే పనిలో పడ్డాయి. ఇక టెక్నాలజీ పరంగా దూసుకుపోతోంది. అయితే హైదరాబాద్‌ టిక్‌టాక్‌ స్థానాన్ని కైవసం చేసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది.

ఈ క్రమంలో నగరానికి చెందిన పబ్బాస్‌ గ్రూప్‌ హైస్టార్‌ అనే ఓ యాప్‌ను విడుదల చేసింది. గతంలో కొన్ని యాప్స్‌ 15 సెకన్ల నిడివి కలిగిన వీడియో మాత్రమే చేసుకునే అవకాశం ఉండేది, తమ యాప్‌లో ఒక నిమిషం వరకూ వీడియోలు చేసుకోవచ్చని హైస్టార్‌ యాప్‌ సీఈవో స్వామి తెలిపారు.

డైలాక్స్‌, కామెడీ, గేమింగ్‌, ఫుడ్‌, స్పోర్స్ట్, మీమ్స్‌ .. ఇలా ఎన్నో రకరకాల అంశాల్లో వీడియోలు అప్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు. ఇప్పటికే ఎంతో పేరొందిన వారికి పలు కంపెనీల ప్రకటనల్లో నటించే అవకాశం కల్పిస్తున్నామని అన్నారు. తద్వారా పేరు ప్రతిష్టలతో పాటు సంపాదనా కూడా ఉంటుందని పేర్కొన్నారు.

Next Story